Mobile Phone Explosion : బాబోయ్.. బాంబులా పేలిన మొబైల్ ఫోన్..! తీవ్ర గాయాలతో వృద్ధుడు మృతి

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ మొబైల్ ఫోన్ బ్యాటరీ బాంబులా పేలింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో వృద్ధుడు చనిపోయాడు.

Mobile Phone Explosion : బాబోయ్.. బాంబులా పేలిన మొబైల్ ఫోన్..! తీవ్ర గాయాలతో వృద్ధుడు మృతి

Mobile Phone Explosion : ఫోన్.. ఇప్పుడు అందరి జీవితంలో భాగమైపోయింది. తిండి, నీరు లేకపోయినా ఉండగలరేమో. కానీ, ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేని పరిస్థితి కొందరిది. ఇప్పుడు దాదాపుగా అన్ని పనులు స్మార్ట్ ఫోన్ ద్వారానే అయిపోతున్నాయి. దీంతో అంతా వాటి మీద బాగా డిపెండ్ అయిపోయారు. కొందరు వాటికి బానిసలుగా మారారు. పగలు, రాత్రి అనే తేడా లేదు నిత్యం వెంట ఫోన్స్ ఉండాల్సిందే. అయితే, ఫోన్ తో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. ఒక్కోసారి ఫోన్ బాంబులా పేలి మీ ప్రాణాలు తీయొచ్చు.

Also Read..Smart Phone Syndrome : కంటిచూపును హరిస్తున్న ‘స్మార్ట్ పోన్ సిండ్రోమ్’, ఇది ఎందుకు వస్తుంది? పరిష్కారం కోసం నిపుణులు సూచనలు..

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ మొబైల్ ఫోన్ బ్యాటరీ బాంబులా పేలింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో వృద్ధుడు చనిపోయాడు.

Also Read..Cell Phone Blast Woman Died : సెల్ ఫోన్ పేలడంతో నిద్రలోనే కన్నుమూసిన మహిళ

జిల్లా హెడ్ క్వార్టర్స్ కి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాద్ నగర్ టౌన్ లో సోమవారం ఈ ఘటన జరిగింది. మొబైల్ ఫోన్ బ్యాటరీ పేలి 68ఏళ్ల వృద్ధుడు దయారామ్ బరోద్ మరణించాడు. వృద్ధుడు తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లాల్సి ఉంది. అతడి స్నేహితుడు బరోద్ కు ఫోన్ చేశాడు. అయితే అది పని చేయలేదు. దీంతో అతడు బరోద్ ఇంటికి వెళ్లి చూడగా అతడు షాక్ కి గురయ్యాడు. తీవ్ర గాయాలతో బరోద్ చనిపోయి కనిపించాడు. అతడి శరీరంలోని పైభాగాలు చిధ్రమయ్యాయి.(Mobile Phone Explosion)

Also Read..సెల్ ఫోన్ వాడుతున్నారా? : మీ తల, మెడ జాగ్రత్త!

విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. మొబైల్ ఫోన్ బ్యాటరీ పేలి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇంట్లో ఎలాంటి పేలుడు పదార్ధాలు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. మృతదేహం దగ్గర పడున్న మొబైల్ ఫోన్ ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ల్యాబ్ కి పంపారు. ఇక ఫోరెన్సిక్ నిపుణులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేపట్టారు. వృద్ధుడి ఇంటికి సమీపంలో హైటెన్షన్ కరెంట్ లైన్ వెళ్తోంది. దాని వల్ల ఈ ఘటన జరిగిందా? అనే కోణంలోనూ విచారిస్తున్నారు.

Also Read..Smart Phone Syndrome : గంటల కొద్దీ ఫోన్ చూస్తున్నారా? అయితే మీకు స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్ రావచ్చు..మీ కంటిచూపుని చెక్ చేసుకోండి..

మొబైల్ ఫోన్ బ్యాటరీ పేలి వృద్ధుడు చనిపోయాడనే వార్త స్థానికంగా కలకలం రేపింది. అయితే, అసలేం జరిగింది? అనేది మాత్రం మిస్టరీగా మారింది. ఫోన్ ఎలా పేలింది? ఎందుకు పేలింది? ఏ కారణంగా ఈ ప్రమాదం జరిగింది? ఫోన్ ను ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా ఈ పేలుడు జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది.