Smart Phone Syndrome : గంటల కొద్దీ ఫోన్ చూస్తున్నారా? అయితే మీకు స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్ రావచ్చు..మీ కంటిచూపుని చెక్ చేసుకోండి..

గంటల కొద్దీ ఫోన్ చూస్తుంటారా? చీకట్లో కూడా ఫోన్ స్క్రీన్ నే తదేకంగా చూస్తున్నారా? అయితే మీకు స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్ రావచ్చు..మీ కంటిచూపుని చెక్ చేసుకోండి..లేదంటే శాశ్వతంగా కంటిచూపు కోల్పోవచ్చని చెబుతున్నారు నిపుణులు.

Smart Phone Syndrome : గంటల కొద్దీ ఫోన్ చూస్తున్నారా? అయితే మీకు స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్ రావచ్చు..మీ కంటిచూపుని చెక్ చేసుకోండి..

hyderabad woman lost her vision with Smart Phone Syndrome

Smart Phone Syndrome : ఏ వస్తువులూ.. సరిగా కనిపించవు. ప్రకాశవంతమైన ఆబ్జెక్ట్స్ కూడా సరిగా చూడలేరు. కొన్ని దృశ్యాలు మసకబారినట్లుగా.. మరికొన్ని జిగ్ జాగ్ లైన్లలా కనిపిస్తుంటాయ్. దగ్గరగా ఉండే వస్తువులను కూడా సరిగా గుర్తించలేకపోతున్నారా? అయితే.. మీరు స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లే. కచ్చితంగా.. ఒకసారి డాక్టర్ చెకప్‌కి వెళ్లాల్సిందే! ఈ సరికొత్త జబ్బు.. ఇప్పుడు జనాన్ని భయపెడుతోంది. రోజులతో పాటు మనుషుల అలవాట్లు, జీవనశైలి కూడా మారుతున్నాయ్. దానికి తగ్గట్లుగానే.. కొత్త కొత్త రోగాలు కూడా పుట్టుకొస్తున్నాయ్? అసలేంటీ.. ఈ స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రోమ్?

స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్. ఇదే.. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ యూజర్లతో పాటు సాధారణ జనాన్ని కూడా భయపెడుతోంది. ఉన్నట్టుండి.. కళ్ల ముందు అంతా మసకబారినట్లు అనిపిస్తుంటుంది. కళ్ల మీద లైట్ వేస్తే ఎలా ఉంటుందో తెలుసుగా.. సరిగ్గా అలాగే అనిపిస్తుంది. మీ కంటిచూపుకు ఎలాంటి ఇబ్బంది లేదని.. అంతా బాగానే కనిపిస్తోందని మీరు అనుకున్నా.. ఏదో ఒక క్షణంలో.. మీ చూపు మసకబారొచ్చు. కళ్ల ముందున్న వస్తువులు.. అస్పష్టంగా కనిపించొచ్చు. ఒక్కోసారి.. కంటి చూపు పోయినట్లు అనిపిస్తుంది. ఇప్పుడు.. చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య ఇదే. చూపులో ఏదో తేడా వచ్చిందని.. కంటి ఆస్పత్రికి వెళ్లాక.. అక్కడ టెస్టులవీ చేశాక.. రిపోర్టులో చూస్తే.. అందులో షాకింగ్ విషయాలేమీ ఉండవు. అంతా నార్మల్‌గానే ఉందని చూపిస్తుంది. మరి.. కంటిచూపులో తేడా రావడానికి కారణమేంటి? అదే.. స్మార్ట్ ఫోన్ సిండ్రోమ్.

Smart Phone Syndrome : కంటిచూపును హరిస్తున్న ‘స్మార్ట్ పోన్ సిండ్రోమ్’, ఇది ఎందుకు వస్తుంది? పరిష్కారం కోసం నిపుణులు సూచనలు..

సాధారణ మొబైల్ ఫోన్.. మనుషుల మధ్య దూరాన్ని తగ్గించి.. ఒకరితో ఒకరిని కనెక్ట్ చేసింది. అదే ఫోన్.. స్మార్ట్ ఫోన్‌గా అప్‌గ్రేడ్ అయ్యాక.. రకరకాలుగా అప్‌డేట్ అయ్యాక.. మొత్తం ప్రపంచమే అరచేతిలోకి వచ్చేసింది. ఉదయం లేవడంతోనే.. మొబైల్‌ని వెతికి.. అందులో అప్‌డేట్స్ ఏమిటో చూస్తే గానీ.. చాలా మందికి రోజు మొదలవదు. ఇంకొందరికైతే.. మొబైల్ లేనిదే రోజు గడవదు. ఇంకొందరు.. మనుషులతో కంటే.. స్మార్ట్ ఫోన్లతోనే ఎక్కువగా గడిపేస్తుంటారు. జస్ట్.. నిద్ర పోయినప్పుడు మాత్రమే.. ఫోన్‌కి రెస్ట్ ఇస్తారు. కొందరు.. నిద్రపట్టే దాకా ఫోన్ పట్టుకునే కూర్చుంటారు. అయితే.. మొబైల్ వాడకం వల్ల.. ఎన్ని ప్రయోజనాలున్నాయో.. అతిగా వాడితే.. అంతే అనర్థాలున్నాయ్. విపరీతమైన మొబైల్ వాడకంతో.. అనేక అనారోగ్యాలు వస్తున్నాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా.. మహిళల్లో స్మార్ట్ ఫోన్ అధికంగా వినియోగిస్తున్న వారిలో.. దృష్టి లోపాలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. ప్రధానంగా.. రాత్రి సమయాల్లో.. లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత ఫోన్ వాడితే.. అది కంటిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని హెచ్చరిస్తున్నారు.

హైదరాబాద్‌లో ఇటువంటి కేసు బయటపడింది. దాంతో.. జనంలో కొత్త ఆందోళన మొదలైంది. 30 ఏళ్ల ఓ మహిళ.. తన మొబైల్ ఫోన్‌కు అడిక్ట్ అయిపోయింది. చీకట్లో కూడా గంటల తరబడి.. అదే పనిగా ఫోన్‌లో నిమగ్నమై ఉండేది. దీంతో.. ఆవిడకు తీవ్రమైన దృష్టిలోపం తలెత్తింది. దాదాపు ఏడాదిన్నరగా.. ఆవిడ ఈ సమస్యతో బాధపడుతోంది. డాక్టర్‌ని సంప్రదించి.. కంటి చూపు విషయంలో ఆమె ఎదుర్కొంటున్న ఇబ్బందులను, లక్షణాలను చెప్పింది. ఈ విషయాలను.. ఆ డాక్టర్ ట్విట్టర్‌లో షేర్ చేయడంతో.. విషయం బయటకొచ్చింది. ఆవిడకు.. ఏ వస్తువు సరిగా కనిపించేది కాదు.. కొన్ని వస్తువులైతే.. బ్లర్‌గా, మరికొన్ని జిగ్ జాగ్ లైన్లలా కనిపించేవి. ఏ వస్తువునూ సరిగా గుర్తించలేకపోవడం లాంటి సమస్యలు తలెత్తాయి. రాత్రుళ్లైతే ఒక్కోసారి కళ్లే కనిపించేవి కాదు. దాంతో.. డాక్టర్ ఆమె జీవనశైలి, అలవాట్లు, సెల్ ఫోన్ వాడకం లాంటి వివరాలు తెలుసుకున్నారు. చివరగా.. ఆమెకు స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రోమ్ అనే వ్యాధి వచ్చినట్లు నిర్ధారించారు.

Hyderabad Woman: స్మార్ట్ ఫోన్ వల్ల కంటి చూపు కోల్పోయే స్థితికి చేరుకున్న మహిళ

అయితే.. ఇంటి దగ్గరే ఉంటూ దివ్యాంగుడైన తన బిడ్డను చూసుకునేందుకు.. ఆ మహిళ తన బ్యూటీషియన్ ఉద్యోగాన్ని వదిలిపెట్టింది. తర్వాత.. చాలా గంటల పాటు తన బిడ్డ అవసరాల కోసం ఎక్కువగా ఫోన్‌లో సెర్చ్ చేస్తూ ఉండేది. రోజులో.. కొన్ని గంటల పాటు మొబైల్ చూడటం, ముఖ్యంగా.. బిడ్డ నిద్రపోయిన తర్వాత.. రాత్రి పూట అన్ని లైట్లు ఆఫ్ చేసిన తర్వాత.. 2 నుంచి 3 గంటల పాటు ఫోన్ వినియోగిస్తూ ఉండేది. ఈ కారణంగానే.. ఆవిడకు స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రోమ్ వచ్చిందనే నిర్ధారణకు వచ్చారు. చీకట్లో.. స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడటంతోనే.. ఆవిడలో దృష్టి లోపాలు తలెత్తినట్లు గుర్తించారు. చీకట్లో.. మొబైల్ స్క్రీన్ నుంచి వచ్చే వెలుగు.. కళ్ల మీద 2 గంటల కంటే ఎక్కువగా పడటం వల్ల.. వస్తువులను గుర్తించలేకపోవడం, చూపు నిలపలేకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతున్నట్లు.. డాక్టర్లు చెబుతున్నారు. ఒక్క స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు.. ఎక్కువ సేపు స్మార్ట్ ఫోన్లు వాడేవాళ్లు, కంప్యూటర్లపై పని చేసేవారు, ట్యాబ్లెట్లు వాడే వాళ్లు.. ఈ విధమైన సమస్యకు గురవుతున్నారు. దీనిని.. కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని, డిజిటల్ విజన్ సిండ్రోమ్ సమస్యగానూ పరిగణిస్తున్నారు.