Hyderabad Woman: స్మార్ట్ ఫోన్ వల్ల కంటి చూపు కోల్పోయే స్థితికి చేరుకున్న మహిళ

మంజుకి ఉన్న అలవాట్లు, ఆమె పని వంటి పలు విషయాలను వైద్యుడు తెలుసుకున్నారు. మంజు ఏడాదిన్నర క్రితం బ్యూటీషియన్ గా పనిచేసేవారు. తన చిన్నారిని చూసుకోవడానికి ఆ పని మానేశారు. అనంతరం ఇంట్లో స్మార్ట్ ఫోనుకు బాగా అలవాటు పడ్డారు. రాత్రుళ్లు చీకటి గదిలోనూ స్మార్ట్ ఫోన్ చూసేవారు. సరైన సమయానికి సమస్యను గురించి సరైన చికిత్సా విధానాన్ని పాటించడంతో మంజు కంటికి ప్రమాదం తప్పింది. మొబైల్ ఫోన్లను అధికంగా వాడే వారు కంటి గురించి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Hyderabad Woman: స్మార్ట్ ఫోన్ వల్ల కంటి చూపు కోల్పోయే స్థితికి చేరుకున్న మహిళ

Hyderabad Woman

Hyderabad Woman: ప్రస్తుత కాలంలో స్మార్ట్ గాడ్జెట్లకు అందరూ అలవాటుపడిపోయారు. మొబైల్ ఫోన్ల వాడకం ఏ మేరకు ఉందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. మొబైల్ ఫోన్ల లైట్ కంటిపై చాలా సేపు పడితే ప్రమాదం పొంచి ఉంటుందని తెలిసినా చాలా మంది ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ముందస్తు జాగ్రత్తలు ఏవీ తీసుకోకుండా కంటి చూపు పోగొట్టుకున్న వారూ ఉన్నారు. హైదరాబాద్ లోని ఓ మహిళ కూడా తాజాగా ఇటువంటి పరిస్థితినే ఎదుర్కున్నారు.

చీకటిలో మొబైల్ ఫోన్ ను అదే పనిగా చూస్తూ కంటి చూపు కోల్పోయే స్థితికి చేరుకున్నారు ఆ మహిళ. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ న్యూరాలజిస్ట్ డా.సుధీర్ ట్విట్టర్ లో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం… మంజు అనే 30 ఏళ్ల మహిళ ప్రతిరోజు రాత్రి సమయంలో చీకటి గదిలో చాలా సేపు స్మార్ట్ ఫోన్ చూస్తూ గడిపారు.

దాదాపు ఏడాదిన్నర కాలంగా కంటి సమస్యలతో బాధపడుతున్నారు. వస్తువులను సరిగ్గా చూడలేని స్థితికి ఆమె కళ్లు చేరుకున్నాయి. కంటి వైద్యుడి వద్దకు వెళ్లినా లాభం లేకుండాపోయింది. న్యూరాలజిస్ట్ వద్దకు వెళ్లాలని కంటి వైద్యుడు ఆమెకు సూచించారు. దీంతో ఆమెకు మరిన్ని వైద్య పరీక్షలు చేసి, స్టార్ట్ ఫోన్ విజన్ సిండ్రమ్ (SVS)గా న్యూరాలజిస్ట్ నిర్ధారించారు. ఈ సిండ్రమ్ ఉంటే కంటి సంబంధిత సమస్యలు రావడమే కాకుండా అంధులుగా మారే ప్రమాదమూ ఉంటుంది.

మంజుకి ఉన్న అలవాట్లు, ఆమె పని వంటి పలు విషయాలను వైద్యుడు తెలుసుకున్నారు. మంజు ఏడాదిన్నర క్రితం బ్యూటీషియన్ గా పనిచేసేవారు. తన చిన్నారిని చూసుకోవడానికి ఆ పని మానేశారు. అనంతరం ఇంట్లో స్మార్ట్ ఫోనుకు బాగా అలవాటు పడ్డారు. రాత్రుళ్లు చీకటి గదిలోనూ స్మార్ట్ ఫోన్ చూసేవారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైద్యుడు ఆమెను స్క్రీన్ సమయం తగ్గించుకోవాలని చెప్పారు. అలాగే పలు ఔషధాలు వాడమన్నారు.

ఆ రెండింటినీ పాటించాక మంజు కంటి చూపు మెరుగుపడింది. 18 నెలలుగా ఆమె పడుతున్న బాధ నుంచి విముక్తి పొందారు. మొబైల్ ను గంటల కొద్దీ చూస్తుండడం వల్లే ఆమె కంటిలో సమస్య ఏర్పడిందన్న తమ అంచనా నిజమేనని నిర్ధారణ అయిందని వైద్యుడు చెప్పారు. సరైన సమయానికి సమస్యను గురించి సరైన చికిత్సా విధానాన్ని పాటించడంతో మంజు కంటికి ప్రమాదం తప్పింది. మొబైల్ ఫోన్లను అధికంగా వాడే వారు కంటి గురించి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Gita GPT vs ChatGPT: భగవద్గీత స్ఫూర్తితో ChatGPT వంటి చాట్ బాట్ అభివృద్ధి చేసిన బెంగళూరు వ్యక్తి