Gita GPT vs ChatGPT: భగవద్గీత స్ఫూర్తితో ChatGPT వంటి చాట్ బాట్ అభివృద్ధి చేసిన బెంగళూరు వ్యక్తి
సకల శాస్త్రాల సారం భగవద్గీత అని చాలా మంది హిందువులు నమ్ముతారు. మన జీవితంలో ఎదురయ్యే అన్ని ప్రశ్నలకు అందులో సమాధానం దొరుకుతుందని విశ్వసిస్తారు. దీంతో భగవద్గీత ఆధారంగానే ఓ గూగుల్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ "చాట్ జీపీటీ"పై వంటి చాట్ బాట్ ను అభివృద్ధి చేశారు.

Gita GPT vs ChatGPT: సకల శాస్త్రాల సారం భగవద్గీత అని చాలా మంది హిందువులు నమ్ముతారు. మన జీవితంలో ఎదురయ్యే అన్ని ప్రశ్నలకు అందులో సమాధానం దొరుకుతుందని విశ్వసిస్తారు. దీంతో భగవద్గీత ఆధారంగానే ఓ గూగుల్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ “చాట్ జీపీటీ”పై వంటి చాట్ బాట్ ను అభివృద్ధి చేశారు.
సంచలనం సృష్టిస్తున్న “చాట్ జీపీటీ”పై దిగ్గజ సంస్థలు ఎంతగా ఆసక్తి కనబర్చుతున్నాయో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఇప్పటికే “చాట్ జీపీటీ” వంటి చాట్ బాట్ “బార్డ్”ను తీసుకొచ్చింది గూగుల్. అదే సమయంలో మైక్రోసాఫ్ట్ కూడా ‘ఓపెన్ ఏఐ’ సంస్థతో కలిసి “చాట్ జీపీటీ”ని మరింత అభివృద్ధి పర్చుతోంది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ బింగ్ ను అప్ డేట్ చేయనుంది. కేవలం దిగ్గజ సంస్థలే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయని అనుకుంటే పొరపాటే. ఇదే తరహా చాట్ బట్ ను అభివృద్ధి చేయాలని స్టార్టప్ లు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి.
అటువంటి చాట్ బాటే గీత జీపీటీ (Gita GPT). బెంగళూరులోని ఓ గూగుల్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దీన్ని అభివృద్ధి చేశారు. దీని గురించి ఆ ఇంజనీర్ సుకురు సాయి వినీత్ వివరాలు తెలిపారు. భగవద్గీత స్ఫూర్తితో తాను దీన్ని అభివృద్ధి చేశానని అన్నారు. చాట్ జీపీటీ వంటి ఏఐ ఆధారిత టూల్ ను సాయి వినీత్ రూపొందించారు. మన జీవితానికి సంబంధించిన ఏదైనా ప్రశ్న అడిగితే ఈ గీత జీపీటీ భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన సమాధానాల ఆధారంగా జవాబులు ఇస్తోంది.
నేరుగా భగవద్గీత నుంచి సమాధానాలు అందుతాయి. ప్రతిరోజు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం కోసం “గీత”ను సంప్రదించండి అంటూ గీత జీపీటీ సూచిస్తోంది. ‘ఓపెన్ ఏఐ’ సంస్థ జీపీటీ-3 ఆధారంగా గీత జీపీటీని అభివృద్ధి చేశారు. ఇంటర్నెట్ గురించి ప్రాథమిక అంశాలు తెలిసిన వారందరూ ఇప్పుడు చాట్ జీపీటీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ చాట్ బోట్.. ఏ ప్రశ్న అడిగినా వెంటనే సమాధానం ఇస్తుంది. చాట్ జీపీటీ కూడా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చక్కని సలహాలు ఇస్తుంది.
When the soul leaves the body, then mind, intelligence, and false ego also go with the soul?
According to GitaGPT: pic.twitter.com/GHhkWE8WSK
— Gita GPT ? (@Gita_GPT) February 8, 2023