Google’s AI Chatbot ‘Bard’: “బార్డ్”ను ప్రవేశపెట్టిన వేళ.. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కు రూ.8 లక్షల కోట్ల నష్టం

గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ దాదాపు రూ.8 లక్షల కోట్ల మార్కెట్ విలువను కోల్పోయింది. ఛాట్ జీపీటీ (ChatGPT)కి పోటీగా గూగుల్ నిన్న తమ చాట్‌ బాట్ "బార్డ్"ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రచార వీడియోను గూగుల్ పంచుకుంది. అయితే, అందులో ఓ ప్రశ్నకు "బార్డ్" తప్పుడు సమాచారం ఇచ్చింది.

Google’s AI Chatbot ‘Bard’: “బార్డ్”ను ప్రవేశపెట్టిన వేళ.. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కు రూ.8 లక్షల కోట్ల నష్టం

Google's AI Chatbot 'Bard'

Google’s AI Chatbot ‘Bard’: గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ దాదాపు రూ.8 లక్షల కోట్ల మార్కెట్ విలువను కోల్పోయింది. ఛాట్ జీపీటీ (ChatGPT)కి పోటీగా గూగుల్ నిన్న తమ చాట్‌ బాట్ “బార్డ్”ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రచార వీడియోను గూగుల్ పంచుకుంది. అయితే, అందులో ఓ ప్రశ్నకు “బార్డ్” తప్పుడు సమాచారం ఇచ్చింది.

దీంతో “బార్డ్” పనితీరు, సమర్థతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆల్ఫాబెట్ కు భారీ నష్టం వచ్చింది. ప్రస్తుతం అందరి దృష్టీ ఛాట్ జీపీటీ (ChatGPT) పైనే పడింది. దాన్ని ఓపెన్ ఏఐ సంస్థ అభివృద్ధి చేయగా, మైక్రోసాఫ్ట్ కూడా అందులో భాగస్వామిగా మారి దాన్ని మరింత అభివృద్ధి చేస్తోంది. ఏదైనా అంశాన్ని గురించి శర వేగంగా స్పందించే సామర్థ్యం ఉండేలా తదుపరి తర ఛాట్ జీపీటీని రూపొందిస్తోంది.

నిన్న ఆల్ఫాబెట్ చేసిన పొరపాటు వల్ల దాని షేర్లు 9 శాతం మేర తగ్గాయి. ఇంతకీ గూగుల్ ప్రచార వీడియోలో “బార్డ్” ఇచ్చిన తప్పుడు సమాచారం ఏంటంటే..? భూ సౌర వ్యవస్థకు వెలుపలి గ్రహానికి సంబంధించి మొట్టమొదటిసారి చిత్రాలను తీసిన ఉపగ్రహం ఏది? అన్న ప్రశ్నకు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (JWST) అని సమాధానం ఇచ్చింది. అయితే, ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ను గత ఏడాది డిసెంబరు 25న ప్రయోగించారు.

నిజానికి, భూ సౌర వ్యవస్థకు వెలుపలి గ్రహానికి సంబంధించి మొట్టమొదటిసారి చిత్రాలను తీసిన ఉపగ్రహం యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ(ESO)కి చెందిన అతి పెద్ద ఉపగ్రహం (నాసా వివరాల ప్రకారం). 2004లో ఈ చిత్రాలను తీశారు. “బార్డ్” మాత్రం జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అని సమాధానం ఇచ్చిందని తొలిసారి రాయిటర్స్ సంస్థ గుర్తించింది.

మరోవైపు, ఓపెన్ ఏఐ సంస్థతో కలిసి మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టిన చాట్ బాట్ వల్ల మైక్రోసాఫ్ట్ షేర్లు 3 శాతం పెరిగాయి. ఛాట్ జీపీటీ ఇప్పటికే అద్భుతాలు సృష్టిస్తోంది. కవితలు రాస్తోంది.. చాలా కచ్చితత్వంతో సమాధానాలు ఇస్తోంది. యూజర్లకు చక్కని సలహాలు ఇవ్వగలదు. ఇటువంటి సేవలపైనే ఇప్పుడు ప్రపంచ దిగ్గజ సంస్థలు పోటీ పడుతున్నాయి.

PT Usha Chairs Rajya Sabha: రాజ్యసభ చైర్మన్ స్థానంలో పీటీ ఉష.. మీరు గ్రేట్ మేడమ్!