Smart Phone Syndrome : కంటిచూపును హరిస్తున్న ‘స్మార్ట్ పోన్ సిండ్రోమ్’, ఇది ఎందుకు వస్తుంది? పరిష్కారం కోసం నిపుణులు సూచనలు..

గంటల కొద్దీ ఫోన్ చూస్తుంటారా? అయితే మీకు స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్ రావచ్చు..మీ కంటిచూపుని చెక్ చేసుకోండి. అసలీ స్మార్ట్ ఫోన్ సిండ్రోమ్ అంటే ఏంటీ? ఎందుకు వస్తుంది? దీనికి పరిష్కార మార్గాలేంటి? నిపుణుల ఏంటున్నారో తెలుసుకోండీ..

Smart Phone Syndrome : కంటిచూపును హరిస్తున్న ‘స్మార్ట్ పోన్ సిండ్రోమ్’, ఇది ఎందుకు వస్తుంది? పరిష్కారం కోసం నిపుణులు సూచనలు..

Smart Phone Syndrome

Smart Phone Syndrome : ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ల ప్రపంచమే. ఎవరి చేతిలో కూడా అవే. స్మార్ట్ ఫోన్ల స్క్రీన్లు గంటల తరబడి ముఖ్యంగా చీకట్లే అదే పనిగా చూస్తుంటే కంటిచూపు కోల్పోయే ప్రమాదముంటుందని చెబుతున్నారు నిపుణులు. స్మార్ట్ ఫోన్లు చాలామందే వాడతారు. కానీ అందరిలోను ‘స్మార్ట్ పోన్ సిండ్రోమ్’ సమస్య రాదు. రాకపోవచ్చు. కొంతమందిలో రానూ వచ్చు. ఎందుకంటే వారు ఆ స్మార్ట్ ఫోను వాడే విధానాన్ని బట్టి ఉంటుంది. అదే స్మార్ట్ ఫోన్‌ని విపరీతంగా వాడే వాళ్లుంటారు. వారికి మాత్రం ఇటువంటి సమస్య వచ్చే అవకాశం చాలానే ఉందంటున్నారు నిపుణులు. అలా అదేపనిగా రోజుకు ఎక్కువ గంటలపాటు స్మార్ట్ ఫోన్ వాడటం వల్ల హైదరాబాద్ లో ఓ మహిళకు స్మార్ట ఫోన్ సిండ్రోమ్ సమస్య వచ్చింది. ఆమె దాదాపు కంటిచూపు కోల్పోయే ప్రమాదానికి వచ్చింది. మొబైల్ ఫోన్‌కు అడిక్ట్ అయిపోవటంతో పైగా చీకట్లో కూడా గంటల తరబడి ఫోన్ వాడటంతో ఆవిడకు తీవ్రమైన దృష్టిలోపం తలెత్తింది. దాదాపు ఏడాదిన్నరగా.. ఆవిడ ఈ సమస్యతో బాధపడింది. దీంతో ఆమె డాక్టర్‌ని సంప్రదించి.. కంటి చూపులో ఇబ్బందులను, లక్షణాలను చెప్పింది. ఆమెను పరిశీలించిన డాక్టర్లు ఆమె ఫోన్ వాడకం గురించికూడా వివరాలు తెలుసుకున్న డాక్టర్లు చివరకు ఆమెకున్న కంటిచూపు సమస్య ఎందుకొచ్చిందో గుర్తించారు. అదే ‘స్మార్ట్ ఫోన్ సిండ్రోమ్’ గా గుర్తించారు. అసలీ స్మార్ట్ ఫోన్ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది? దీనికి ట్రీట్‌మెంట్ ఏదైనా ఉందా? స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రోమ్ తలెత్తకుండా పరిష్కార మార్గాలేంటి?నిపుణులు ఏమన్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఈ స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో అందరికి ఉంది..

అతి అనర్ధాలకు హేతువు అని పెద్దలు అంటుంటారు.మితిమీరిన.. అతి వాడకం ఎప్పుడైనా ప్రమాదమే. అది స్మార్ట్ ఫోన్ అయినా.. మరొకటైనా.. ఏదైనా సరే. దేని లిమిట్ దానికుంటుంది. అది క్రాస్ అయినప్పుడు చేయగలిగేదేమీ ఉండదు. ఆగమేఘాల మీద డాక్టర్ దగ్గరికి పరిగెత్తడం తప్ప. మనలో చాలా మంది ఈ స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రోమ్‌తో బాధపడుతూ ఉండొచ్చు. కానీ.. దానిపై అంతగా దృష్టి పెట్టకపోవడంతో.. వాళ్లు ఎదుర్కొంటున్న దృష్టి లోపం బయటపడకపోవచ్చు. కానీ.. కాస్త సీరియస్‌గా గమనిస్తే.. స్మార్ట్ ఫోన్ స్క్రీన్లకు అతుక్కుపోయే వాళ్లందరికీ.. ఈ వ్యాధి తలెత్తే అవకాశం కచ్చితంగా ఉంది. ఫోన్ లైట్ ఎక్కువగా కళ్ల మీద పడితే.. అది రెటీనాపై ప్రభావం చూపే అవకాశం ఉందని.. వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. రాత్రి పూట లైట్లు ఆపేశాక.. గంటల తరబడి మొబైల్‌లో బ్రౌజింగ్ చేయడం, గంటల తరబడి సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడటం లాంటివి చేస్తే.. ఇంకా డేంజర్ అంటున్నారు. మొబైల్ ఫోన్ వాడకం వ్యసనంగా మారితే.. ఏదో ఒక రోజు కచ్చితంగా స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రోమ్ వ్యాధి బారిన పడక తప్పదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.

Smart Phone Syndrome : గంటల కొద్దీ ఫోన్ చూస్తున్నారా? అయితే మీకు స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్ రావచ్చు..మీ కంటిచూపుని చెక్ చేసుకోండి..

ఈ స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రోమ్‌కు.. కచ్చితమైన ట్రీట్ మెంట్ కూడా ఏమీ లేదు. మందులు కూడా లేవు. మరి.. దీనికి పరిష్కారం ఏంటనే సందేహాలు అందరిలోనూ తలెత్తుతున్నాయ్. అయితే.. హైదరాబాద్‌ మహిళలో ఈ వ్యాధి గుర్తించిన డాక్టర్ కూడా.. బాధితురాలికి ఎలాంటి మందులు ఇవ్వలేదు. మరిన్ని టెస్టులు చేసి.. మందులు ఇవ్వాలని.. ఆవిడ అడిగినప్పటికీ.. డాక్టర్ మాత్రం ఎలాంటి మెడిసిన్ సూచించలేదు. కానీ.. ఆమె జీవనశైలిని మార్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా.. స్మార్ట్ ఫోన్ వాడకాన్ని తగ్గించాలన్నారు. దీంతో.. ఆ మహిళ తన ఫోన్ వాడకాన్ని పూర్తిగా తగ్గించింది. అవసరమైతే తప్ప.. మొబైల్ ఫోన్‌ జోలికి వెళ్లలేదు. నెల రోజుల తర్వాత పరీక్షిస్తే.. ఆ మహిళ కంటి చూపు మెరుగైంది. దృష్టి లోపంతో.. ఏడాదిన్నరగా ఆ మహిళ ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ తొలగిపోయాయ్. మళ్లీ ఎప్పటిలాగే.. అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయ్. ఎలాంటి మందులు వాడకుండానే.. ఆవిడలో దృష్టి లోపాలు తొలగిపోయాయ్. కళ్లలో మెరుపులు, చూపు మసకబారడం, చారలు కనిపించడం, రాత్రి పూట కనిపించకపోవడం లాంటి సమస్యలన్నీ తొలగాయి.

స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్‌ బారిన పడకుండా ఉండాలన్నా.. కంటి చూపులో లోపాలు తలెత్తకుండా కాపాడుకోవాలన్నా.. డిజిటల్ స్క్రీన్‌లను ఎక్కువసేపు చూడొద్దని సూచిస్తున్నారు నిపుణులు. కంప్యూటర్లపై ఎక్కువగా పనిచేయాల్సిన వాళ్లు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి.. కనీసం 20 సెకన్ల పాటు కళ్లకు విరామం ఇవ్వాలని చెబుతున్నారు. అంతేకాదు.. గ్యాప్ ఇచ్చిన సమయంలో.. కనీసం 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను చూడటం వల్ల.. కళ్లకు దూరంగా ఉన్న వస్తువులను గుర్తించే సామర్థ్యం మెరుగవుతుందని చెబుతున్నారు. 20-20-20 రూల్‌గా దీనిని గుర్తుంచుకోవాలంటున్నారు. ముఖ్యంగా.. కంప్యూటర్లు వాడే సమయంలో.. దీనిని తప్పక పాటించాలి. అంతేకాదు.. పనిచేసే గదిలో తగిన వెలుతురు ఉండేలా చూసుకోవాలి. అప్పుడప్పుడు కంటి పరీక్షలు చేసుకోవడంతోనూ.. ప్రయోజనం ఉంటుంది. కంప్యూటర్, మొబైల్, ట్యాబ్స్ స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైటింగ్‌ని.. ఫిల్టర్ చేసేందుకు.. ప్రత్యేకమైన కంటి అద్దాలను వినియోగించడం ఉత్తమమని సూచిస్తున్నారు. పరిస్థితులు మరింత దిగజారడానికి ముందే.. కళ్లపై స్వల్ప ఒత్తిడి ఉన్నప్పుడే.. కంటి పరీక్షలు చేయించుకోవాలి. స్మార్ట్ ఫోన్ యూజర్లు కూడా.. హై రిజల్యూషన్ స్క్రీన్ ఉండేవి వాడితే బెటరని చెబుతున్నారు.

Hyderabad Woman: స్మార్ట్ ఫోన్ వల్ల కంటి చూపు కోల్పోయే స్థితికి చేరుకున్న మహిళ

ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. డిజిటల్ డివైజ్‌ల స్క్రీన్లు ఎక్కువ సేపు చూడటం మానుకోండి. ఇది తీవ్రమైన సమస్యగానే పరిగణించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. దృష్టి సంబంధిత సమస్యలు తలెత్తడం ఖాయం. అందువల్ల.. అవసరం మేరకే స్మార్ట్ ఫోన్ వాడండి. అవసరం లేకపోయినా.. టైంపాస్ కోసం ఫోన్ వాడుతూ పోతే.. ఏదో ఒక రోజు కంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా నిద్రపోవాల్సిన టైమ్‌ హాయిగా నిద్రపోండి. మొబైల్‌ పట్టుకుని కుస్తీలు పడకండి. దానివల్ల అయ్యే టైమ్‌పాస్‌ కన్నా జరిగే నష్టమే ఎక్కువ. మనిషికి కంటి చూపు ఎంత ముఖ్యమో.. ఎంత అవసరమో.. కళ్లు ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. అలాంటి చూపు విషయంలో.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. ఊహించని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలవాట్లు మార్చుకుంటేనే.. అవసరానికి తగ్గట్లుగా మొబైల్ వాడితే.. కంటి చూపునకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని సూచిస్తున్నారు డాక్టర్లు. నిపుణుల సూచనలు పాటించకపోతే కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందని ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలి..దానికి అనుగుణంగా నడచుకోవాలి. ఎందుకంటే సర్వేంద్రియానం ‘నయనం’ప్రధానం అన్నారు పెద్దలు. కంటిచూపు లేకపోతే ఈ ప్రపంచమే అంథకారంగా ఉంటుందనే విషయం తెలిసిందే.