Power Bank
Power Bank: హ్యాండ్ గెంగ్ అనే వ్యక్తి gargantuan పోర్టబుల్ ఛార్జర్ కనిపెట్టాడు. తన స్నేహితుల వద్ద అంతకంటే పెద్ద పవర్ బ్యాంక్ ఉండటంతో అక్కడితో ఆగిపోవాలనుకోలేదు. తనకున్న వెల్డింగ్ స్కిల్స్ తో పెద్ద మెటల్ ఫ్రేమ్ ను రెడీ చేశాడు. స్టెయిన్ లెస్ షీట్ తో Mi power bank ఆకారంలో నిర్మించాడు. దాని లోపల మిడ్ సైజ్ డ్ ఎలక్ట్రిక్ కార్ కు సరిపోయే కెపాసిటీ ఉండే బ్యాటరీని ఏర్పాటు చేశాడు.
అన్నీ ఏర్పాటయ్యాక 5.9 అడుగుల పొడవు, 3.9 అడుగుల వెడల్పు, 0.98 అడుగుల ఎత్తు ఉన్న పవర్ బ్యాంక్ సిద్ధమైంది. దానికి 60 పవర్ సాకెట్లు ఏర్పాటు చేయడంతో నేరుగా మొబైల్ ఫోన్స్ మాత్రమే కాకుండా ఇతర పవర్ బ్యాంకులకు కూడా ఛార్జింగ్ ఎక్కించుకునే వెసలుబాటు కల్పించాడు.
సాధారణంగా పవర్ బ్యాంకులంటే పోర్టబుల్ గా ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లగలం. కానీ, దీనిని వాడాలంటే మోసుకెళ్లాలి. చివరికి దానికి టీవీని కనెక్ట్ చేశాడు, వాషింగ్ మెషీన్ ఆపరేట్ చేశాడు. ఎలక్ట్రిక్ కుకర్ ను కూడా ఏర్పాటు చేశాడు. అన్ని ప్రయోగాలు ఫలించడంతో తాను సక్సెస్ అయ్యానని చెప్పుకుంటున్నాడు ఈ యూట్యూబర్.
Read Also : నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్