‘Angry Hanuman’ : వాహనాలపై ఉండే ఈ హనుమంతుడి చిత్రం డిజైన్ చేసింది ఎవరో తెలుసా..?
ఆటోలు, బైకులు, కార్ల విండ్‌స్క్రీన్‌లు, బస్సులు, లారీలు ఇలా ఎన్నో వాహనాలమీద కనిపించే హనుమంతుడి బొమ్మ గురించీ తెలుసా..? ఆ బొమ్మను డిజైన్ చేసింది ఎవరో తెలుసా..?

'Angry Hanuman' designer Karan Acharya
‘Angry Hanuman’ Designer : ఒకోసారి క్యాజువల్ గా చేసిన పనులే ఫేమస్ అవుతుంటాయి. ఎటువంటి అంచనాలు లేకుండా చేసిన పనులు ప్రశంసలు తెచ్చిపెడతాయి. నలుగురిలోను గొప్పగా నిలబెడతాయి. అటువంటిదో భారతదేశంలో ఎన్నో వాహనాలమీద కనిపించే ఓ మనుమంతుడి చిత్రం. కాషాయ రంగుమీద నలుపు రంగుతో వేసిన హనుమంతుడి బొమ్మ భారతదేశంలో ఆటోలు, మోటార్ బైకులు, కార్ల విండ్‌స్క్రీన్‌లు,బస్సులు, లారీలు ఇలా ఎన్నో వాహనాలమీద కనిపిస్తుంటుంది. అంతేకాదు షాపులమీద కూడా కనిపిస్తుంటుంది. కొంతమంది ఈ బొమ్మను షర్టుమీద కూడా డిజైన్ చేయించుకున్నారు. ఈ హనుమంతుడు బొమ్మను చూస్తే కోపంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది.
దేశ వ్యాప్తంగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వాహనాల మీద కనిపించే ఈ హనుమాన్ స్టిక్కర్ గా మారకముందు ఓ యువకుడి చేతిలోంచి జాలువారింది. కేరళ(Kerala)కు చెందిన కరణ్ ఆచార్య (Karan Acharya)అనే గ్రాఫిక్ ఆర్టిస్ట్ (graphic designer)ఈ బొమ్మను వేశారు. కేరళలోని కాసరగోడ్(Kasaragod)లోని కుంబ్లా (Kumbla village) అనే గ్రామానికి చెందిన 25 ఏళ్ల కరణ్ ఆచార్య హనుమాన్ అంటే ఉగ్రరూపంలో ఉంటే బాగుంటుంది అని అనుకుని కోపంగా చూస్తున్న హనుమాన్ బొమ్మను గీసాడు. కానీ అతను ఆ బొమ్మను గీస్తున్నప్పుడు ఆ బొమ్మ ఓ సంచలనం అవుతుందని ఏమాత్రం ఊహించలేదు.
గణేష్ చతుర్థి సందర్భంగా స్నేహితుల కోసం 2015లో ఈ హనుమాన్ చిత్రాన్ని వేశానని..ఈ చిత్రం పూర్తి చేయటానికి కేవలం అరగంట కూడా పట్టలేదని కరణ్ తెలిపాడు. తను గ్రాఫిక్స్ పూర్తి చేసిన తర్వాత దానిని స్నేహితుడికి పంపగా..రెండు మూడు రోజులకే అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కరణ్ ఫ్రెండ్స్ ప్రొఫైల్‌గా పెట్టుకోవటంతో తెగ వైరల్ అయ్యింది. అలా కొన్ని రోజులకే ఆ చిత్రాన్ని చాలామంది ఉపయోగిస్తున్నారని కరణ్ గుర్తించాడు.అది చాలా పాపులర్ అయిందని అప్పుడే తెలిసి ఆనందపడ్డాడు.
ఈ చిత్రం అంత ఫేమస్ అవ్వటంతో అనూహ్య స్పందన వచ్చింది. ఆ చిత్రం హక్కులు ఇస్తే భారీ నగదు ఇస్తామని ఆశపెట్టారు. కానీ వాటిని కరణ్ సున్నితంగా తిరస్కరించాడు. హనుమాన్ బొమ్మను రాయల్టీ ఫ్రీ బొమ్మగా వేశానని, అందుకు డబ్బులు తీసుకోలేనని చెప్పేశాడు. హనుమాన్ అందరివాడు. హనుమాన్ బొమ్మను క్యాష్ చేసుకోలేను అంటూ చెప్పాడు. హనుమాన్ బొమ్మను ఎవ్వరైనా ఫ్రీగా ఉపయోగించుకోవచ్చని చెప్పాడు. అలా నచ్చినవారంతా కోపంగా ఉండే హనుమాన్ బొమ్మను తమ వాహనాలపై స్టిక్కర్ రూపంలో వేసుకుంటున్నారు. అలా ఏదో క్యాజువల్ గా వేసిన ఆ బొమ్మకు అంత పేరు వచ్చింది. కరణ్ నిజంగా డబ్బుకు ఆశపడి హక్కులు వదులు కోకపోవటం గొప్ప విషమనే చెప్పాలి.
Railway : ఒక్క ఎలుకను పట్టడానికి రూ.41,000 ఖర్చు చేసిన రైల్వే శాఖ .. ఎన్ని ఎలుకలు పట్టిందో తెలుసా..?
కాగా హిందువులకు హనుమాన్ అంటే ఎంతటి భక్తో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఆపదల నుంచి కాపాడే ఆపద్భాంధువుడిగా కొలుస్తారు. హనుమాన్ బొమ్మ వాహనాలపై ఉంటే ప్రమాదాల నుంచి రక్షిస్తాడని నమ్ముతారు. రాత్రుళ్లు భయం వేస్తే చాలు.. ఠక్కున గుర్తుకొచ్చేది హనుమానే..