×
Ad

Tina Dabi, Pradeep Gawande : అమ్మానాన్నలు అయిన ఐఏఎస్ దంపతులు, పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టీనాదాబీ

IAS దంపతులు టీనా దాబీ,ప్రదీప్ గవాండే మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. టీనాదాబి శుక్రవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. బిడ్డ రాకతో వారి ఇంట్లో ఆనందాలు వెల్లివిరిశాయి.

  • Published On : September 16, 2023 / 11:17 AM IST

IAS couple Tina Dabi .. Pradeep Gawande

IAS couple Tina Dabi,Pradeep Gawande : IAS దంపతులు టీనా దాబీ,ప్రదీప్ గవాండే మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. టీనాదాబి శుక్రవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో IAS దంపతులు టీనా దాబీ (Tina Dabi IAS ), ప్రదీప్ గవాండే (Pradeep Gawande IAS) ఇంట్లో సంతోషాలు విరబూశాయి. మొదటిసారి తల్లిదండ్రులు అయిన IAS దంపతులకు స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.

ఐఏఎస్‌ 2015 టాపర్‌ గా నిలిచిన టీనా దాబి పేరు మారుమోగిపోయింది. దేశంలోనే యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్ పరీక్షల్లో మొదటి ర్యాంక్ సాధించిన మొట్టమొదటి దళిత మహిళగా అప్పట్లో దేశ వ్యాప్తంగా టీనా దాబి పేరు మారుమోగి పోయింది. యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించిన టీనాదాబి.. సెకండ్‌ ర్యాంకర్‌ అథర్ అమీర్ ఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ రెండేళ్లకే వారు విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత టీనాదాబి తన కంటే రెండేళ్లు సీనియర్‌ అయిన 2013 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి ప్రదీప్‌ గవాండే ను వివాహం చేసుకున్నారు.

Irom Sharmila : చంద్రబాబు అరెస్ట్‌పై ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో టీనాదాబీ, ప్రదీప్ గవాండే కలుసుకున్నారు. ఇద్దరు ఆరోగ్యశాఖలో పనిచేస్తుండగా కోవిడ్ సమయంలో ఇద్దరు కలిశారు. వర్క్ విషయంలోనే కాకుండా పర్సనల్ విషయాలు కూడా చర్చించుకునేవారు. అలా వారి పరిచయం ప్రేమగా మారింది. ప్రదీప్ టీనాకు ప్రపోజ్ చేయటంతో వారి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అలా వారు 2022 ఏప్రిల్ 22న పెళ్లి చేసుకున్నారు.

సివిల్‌ సర్వీసెస్ పరీక్షల్లో మొదటి ర్యాంక్ సాధించిన మొట్టమొదటి దళిత మహిళగా అప్పట్లో దేశ వ్యాప్తంగా టీనా దాబి పేరు మారుమోగిపోగా, ప్రదీప్ గవాండే మహారాష్ట్రలోని లాతూర్ కు చెందినవారు. 2013లో UPSCలో ఉత్తీర్ణత సాధించి ఇప్పుడు రాజస్థాన్ కేడర్‌కు చెందిన IAS అధికారి.

Hyderabad : మహిళా ఐఏఎస్ అధికారికి వేధింపులు .. ఇంటికి వచ్చి హల్ చల్

అలా టీనాదాబి టాపర్ గాను.. మొదటి వివాహం విఫలం కావటంలోను.. రెండో వివాహం వంటి సందర్భాల్లో బాగా వైరల్ అయ్యారు. తాజాగా ఐఏఎస్ దంపతులు మొదటిసారి తల్లిదండ్రులు అయిన శుభతరుణం కూడా వైరల్ అవుతోంది.