Nita Ambani : నీతా అంబానీ మెస్మరైజింగ్ లుక్‌

ప్రపంచ కుబేరుడు రిలయన్స్ అధినేత సతీమణి మెస్మరైజింగ్ లుక్‌..రిచ్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా కనిపించారు ఈవెంట్ లో..ఆమె కట్టుకున్న చీర, ధరించిన నగలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Nita Ambani

Nita Ambani : నీతా అంబానీ. ప్రపంచ కుబేరుడు రిలయన్స్ అధినేత సతీమణి ఏ చీర కట్టినా..ఏ నగలు పెట్టిన రిచ్ నెస్ ఏమాత్రం తగ్గదు. అదే సమయంలో సంప్రదాయం ఉట్టిపడేలా ఉండటంలో నీతా అంబానీ స్లైలే వేరు..ఆ రిచ్ నెస్ వేరే లెవల్ గా ఉంటుంది. మెస్మరైజింగ్ లుక్‌ తో బాలివుడ్ హీరోయిన్లను కూడా తలదన్నేలా ఆకట్టుకోవటంలో నీతా ప్రత్యేకతే వేరుగా ఉంటుంది. ఎక్క‌డా తగ్గన వైభవం..దర్పంతో డ్రెస్ కు తగిన జ్యువెలరీతో ఓ డిజైనర్ పీస్ లా ఉంటుంటారామె. రిచ్‌నెస్‌కు కేరాఫ్ అడ్రెస్ నీతా అన్నట్లుగా ఉండే నీతా ఆమె హ్యాండ్ బ్యాగులు కూడా అదే రేంజ్ లో ఉంటాయి.

NMACC Launching Event : అంబానీ ఫుడ్ అంటే ఈ రేంజ్ లో ఉంటుంది.. NMACC లాంచింగ్ లో సెలబ్రిటీలకు వెండి ప్లేట్స్‌లో ఫుడ్..

నీతా అంబానీ ముంబైలో క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్‌ను ప్రారంభోత్సవంలో కూడా ఆమె అదే రేంజ్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఆ ఈవెంట్ నీతా అంబానీ.. నెమలి కంఠం రంగు పట్టుచీరతో రిచ్ గానే కాదు హుందాగా కనిపిచారు. క‌ల‌ర్‌ఫుల్‌గా శారీమీద చక్కటి జ్యువెలరీతో ఆకట్టుకున్నారు. బాలీవుడ్ సెల‌బ్ర‌టీల‌కు ఏమాత్రం తీసిపోని ఆక‌ర్ష‌ణీయమైన లుక్‌ తో కనిపించారు.

నెమలికంఠం రంగు గోల్డెన్‌ సిల్క్ శారీలో మెరిసిపోయిన నీతా అంబానీ అదే స్ట‌యిల్‌ బ్లౌజ్ కూడా ధరించి డ్రెస్సుకు తగినట్లుగానే మెడ గోల్డ్‌, ఎమ‌రాల్డ్ నెక్లెస్‌తో ధ‌గ‌ధ‌గా మెరిసిపోయారు. పలువురు బాలివుడ్ సెలబ్రిటీలు ఈ ఈవెంట్ లో మెరిసినా నీతా ప్రత్యేకమైన లుక్ తో మెస్మరైజ్ చేశారు. మ్యాజింగ్ చెవి పోగులు, బ్రెస్‌లెట్స్ తో డిజైనర్ పీస్ లా మెరిసిపోయారు. క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ ఈవెంట్ కోసం నీతా డెక‌రేట్ అయిన తీరు ప‌ర్ఫెక్ట్‌గా ఉంది. మెరూన్ రంగు బొట్టుతోనూ మెస్మ‌రైజింగ్ లుక్ ఆకట్టుకుంటూ ఆమె సోషల్ మీడియాలో వైరల్ గా మారారు.

Mukesh Ambani : అంబానీ కోడలా మజాకా? ఆమె హ్యాండ్ బ్యాగ్ ధర ఎంతో తెలుసా?

 

ట్రెండింగ్ వార్తలు