Diwali 2023 : షారుఖ్‌ ఖాన్ ‘చయ్యా చయ్యా’ పాటకు అమెరికా రాయబారి స్టెప్పులు

దీపావళి వేడుకల్లో అమెరికా రాయబారి బాలివుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ చయ్యా చయ్యా పాటకు స్టెప్పులేశారు. సంప్రదాయ దుస్తులు ధరించి స్టెప్పులతో ఇరగదీశారు.

US Ambassador Shah Rukh Khan song dance

US Ambassador Shah Rukh Khan song dance : దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకలు సందడి సందడిగా జరుగుతున్నాయి.  శుక్రవారం ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో దీపావళి వేడుకలు అంగరంగవైభోగంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి బాలివుడ్ హీరో షారూఖ్ ఖాన్ పాటకు స్టెప్పులేశారు. చక్కటి డ్యాన్స్ తో ఆకట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీపావళి వేడుకల్లో పాలుపంచుకున్న ఎరిక్ తనదైన శైలిలో షారూఖ్ ఖాన్ పాటకు స్టెప్పులేసి ఆకట్టుకున్నారు.

1998లో షారుఖ్‌ ఖాన్‌ నటించిన చిత్రం ‘దిల్‌ సే’లోని ‘చయ్యా చయ్యా’ పాట ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఈ పాటకు అమెరికా రాయబారి ఎరిక్ చక్కటి హిందు సంప్రదాయ దుస్తులు ధరించి డ్యాన్స్ చేశారు.  కుర్తా పైజామా ధరించి..స్టైల్ గా కళ్లజోడు కూడా పెట్టుకుని మరీ డ్యాన్సులేసిన వీడియో నెట్టింట్ హల్ చల్ చేస్తోంది. ఆయన డ్యాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. చప్పట్లతో ఉత్సాహపరిచారు.

చండీగఢ్ యూనివర్సిటీ వ్యవస్థాపక ఛాన్సలర్ సత్నామ్ సింగ్ సంధు ఈ వీడియోను తన ట్విట్టర్ లో షేర్ చేస్తు..”దీపావళి వేడుకలపై సంతోషకరమైన ఆసక్తిని కనబరిచినందుకు యుఎస్ రాయబారి మిస్టర్ ఎరిక్ గార్సెట్టి ఉల్లాసభరితమైన స్ఫూర్తిని నేను అభినందిస్తున్నాను. అమెరికా, భారతదేశం మధ్య ఎప్పటికీ కాంతిమయం.ఆనందం ఉండనివ్వండి!” అని పేర్కొన్నారు. కాగా..దేశవ్యాప్తంగా దీపావళి వేడుకల్ని ప్రజలు అంగరంగ వైభవంగా జరపుకుంటున్నారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్నవారుసైతం ఈ పండుగలను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు.

కాగా గత మే నెలలో ఎరిక్ షారూఖ్ ఖాన్ ను కలిసిన విషయం తెలిసిందే. ముంబైలో ఎరిక్ షారూక్ ను కలిసారు. ఈ సందర్భంగా ఇండియా సినిమా ఇండ్రస్ట్రి గురించి చర్చించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా హాలివుడ్, బాలివుడ్ రెండింటి సాంస్కృతిక ప్రభావం గురించి మాట్లాడుకున్నారు. షారూఖ్ ను కలిసిన ఈ సందర్భాన్ని “నా బాలీవుడ్ అరంగేట్రం సమయం వచ్చిందా? అంటూ ఎరిక్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.