Prakash Raj Controversy: శ్రీరాముడిపై ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ‘వలస కూలీ’ అంటూ అవహేళన చేయడంపై నెటిజన్ల ఆగ్రహం
Prakash Raj Ramayana Controversy: శ్రీరాముడు, రామాయణంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj).
- V Santhosh Kumar
- Updated on- April 17, 2026 / 03:19 PM IST
Actor Prakash Raj inappropriate remarks about Ramayana and Lord Rama.
- రామాయణంపై ప్రకాష్ రాజ్ ఎటకారం
- హిందూ మనోభావాలతో చెలగాటం
- నటుడు ప్రకాష్ రాజ్‌పై భగ్గుమంటున్న హిందూ సంఘాలు.
Prakash Raj: హిందూ ధర్మంలో అత్యంత పూజనీయమైన శ్రీరాముడిపై నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతున్నాయి. కేరళ సాహిత్య ఉత్సవంలో పాల్గొన్న ఆయన రామాయణాన్ని వక్రీకరిస్తూ చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశాయి. రాముడు, లక్ష్మణులను ఉత్తర భారతదేశం నుండి వచ్చిన ‘వలస కూలీలు’గా అభివర్ణించడమే కాకుండా, వారు రావణుడి పొలంలో పండ్లు దొంగిలించారంటూ ఎద్దేవా చేయడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. శూర్పణఖ జీఎస్టీ అడిగిందంటూ ఆయన చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి.
Kangana Ranaut: చిరాగ్‌తో పెళ్లి వార్తలు.. క్లారిటీ ఇచ్చిన కంగనా రనౌత్
ప్రకాష్ రాజ్ (Prakash Raj)రాజకీయ విమర్శలు చేస్తూ పవిత్ర ఇతిహాసాలను కించపరచడంపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఒక దేశ సంస్కృతికి, నమ్మకానికి ప్రతీకలైన దేవుళ్లను ఇలాంటి చిల్లర వ్యాఖ్యలతో అవమానించడం సిగ్గుచేటని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మతపరమైన మనోభావాలను కించపరిచినందుకు ఆయనపై క్రిమినల్ కేసు కూడా నమోదైనట్లు సమాచారం. నిరంతర వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే ప్రకాష్ రాజ్, ఈసారి హద్దులు దాటారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వివాదం నేపథ్యంలో ప్రకాష్ రాజ్‌ను సినిమాల నుండి బహిష్కరించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఎస్.ఎస్. రాజమౌళి ‘వారణాసి’, సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’, మరియు ‘దృశ్యం 3’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాల నుండి ఆయన్ను తొలగించాలని సినీ ప్రియులు నిర్మాతలు, దర్శకులను కోరుతున్నారు. ప్రజల విశ్వాసాలను గౌరవించని నటులకు భారీ ప్రాజెక్టులలో అవకాశం ఇవ్వడంపై పునరాలోచించాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలు ప్రకాష్ రాజ్ సినీ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.
