Kangana Ranaut: చిరాగ్‌తో పెళ్లి వార్తలు.. క్లారిటీ ఇచ్చిన కంగనా రనౌత్
చిరాగ్‌తో పెళ్లి అంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన కంగనా రనౌత్(Kangana Ranaut).
Kangana Ranaut clarifies comments regarding her marriage to Chirag Paswan
- చిరాగ్ పాశ్వాన్‌తో రిలేషన్‌పై కంగనా స్పందన
- అతను నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ క్లారిటీ
- ఏదైనా ఉంటె నేనే చెప్తాను అంటూ కామెంట్స్
Kangana Ranaut: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మండి ఎంపీ కంగనా రనౌత్(Kangana Ranaut) తన బోల్డ్ స్టేట్మెంట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. అయితే ఈసారి ఆమె రాజకీయాల కంటే వ్యక్తిగత విషయాల వల్ల నెట్టింట హాట్ టాపిక్‌గా మారారు. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో ఆమె ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ ప్రాంగణంలో వీరిద్దరూ నవ్వుతూ పలకరించుకున్న దృశ్యాలు వైరల్ కావడంతో ఈ రూమర్లు మరింత ఊపందుకున్నాయి.
ఈ నేపథ్యంలో కంగనా తనపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ ఘాటుగా క్లారిటీ ఇచ్చారు. చిరాగ్ తనకు అత్యంత సన్నిహిత మిత్రుడని, మా మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. తమ మధ్య ఎలాంటి రొమాన్స్ లేదని, ఒకవేళ నిజంగానే ప్రేమ ఉండి ఉంటే ఈ పాటికి పెళ్లి చేసుకుని పిల్లలు కూడా ఉండేవారని తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. కేవలం స్నేహం తప్ప అంతకు మించి ఏమీ లేదని చెబుతూ వస్తున్న రూమర్లన్నింటినీ ఆమె పూర్తిగా కొట్టిపారేశారు.
నిజానికి వీరిద్దరి పరిచయం ఇప్పటిది కాదు. 2011లో వచ్చిన ‘మిలే నా మిలే హమ్’ అనే చిత్రంలో వీరిద్దరూ జంటగా నటించారు. ఆ తర్వాత చిరాగ్ రాజకీయాల్లోకి వెళ్లగా, కంగనా స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ప్రస్తుతం ఇద్దరూ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. పాత స్నేహంతోనే ఒకరినొకరు గౌరవించుకుంటామని, అంతకు మించి జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని కంగనా స్పష్టం చేయడంతో ఈ గాసిప్‌లకు ఫుల్ స్టాప్ పడినట్లయింది.
