Rekha Vedavyas : గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆనందం హీరోయిన్.. షాకింగ్ లుక్‌లో రేఖ
ఆనందం హీరోయిన్ రేఖ వేదవ్యాస్ (Rekha Vedavyas ) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
- Thota Vamshi Kumar
- Published on- April 30, 2026 / 01:55 PM IST
2001లో విడుదలైన ఆనందం మూవీతో టాలీవుడ్‌కు పరిచమైంది రేఖ వేదవ్యాస్.
తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
దీంతో తెలుగు, కన్నడ, తమిళ బాషల్లో వరుస అవకాశాలను అందుకుంది.
స్టార్ హీరోయిన్‌గా ఎదిగి 30కి పైగా చిత్రాల్లో నటించింది.
తెలుగులో దొంగోడు, ఒకటో నెంబర్ కుర్రాడు, జానకి వెడ్స్ శ్రీరామ్, అనగనగనగా ఓ కుర్రాడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో చెదరని ముద్ర వేసింది.
అయితే.. ఒకనొక సమయంలో వరుస పరాజయాలు, ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె 2014 తరువాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కనిపించిన ఆమెను చూసి అంతా షాక్ అయ్యారు.
ఆమె బక్క చిక్కిపోయి కనిపించడంతో అంతా అవాక్కైయ్యారు.
ఆమె కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు
సినిమాలకు దూరమైన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫోటోలను షేర్ చేస్తోంది.
