Pawan Kalyan-Niranjan: అభిమాని కోరిక తీర్చిన పవన్ కళ్యాణ్.. స్వయంగా వెళ్లి.. ఫొటోలు వైరల్..

జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ కు పవన్ కల్యాణ్ అంటే ఎనలేని అభిమానం. అతను పవన్ కల్యాణ్ ను కలవాలని ఉందని కోరడంతో విషయం తెలుసుకున్న పవన్ హన్మకొండ హనుమాన్ నగర్‌లోని బాలుడి నివాసానికి వెళ్లి పరామర్శించారు. బాలుడి కుటుంబ సభ్యులకు లక్ష రూపాయలు అందించి దాంతో పాటు వెంకటేశ్వర స్వామి ప్రసాదం అందజేశారు. నిరంజన్ ఆరోగ్యం కోసం భద్రకాళి గుడిలో పూజలు చేస్తానని పవన్ చెప్పారు. పవన్ కల్యాణ్ ను చూసేందుకు అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో హనుమకొండలోని ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది.

  • Updated on- June 17, 2026 / 02:59 PM IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13
Pawan Kalyan