Best Camera Phones : కంటెంట్ క్రియేటర్ల కోసం రూ. 20వేల లోపు బెస్ట్ కెమెరా ఫోన్లు.. ఫ్లిప్‌కార్ట్ BBD సేల్ ముందే భారీ డిస్కౌంట్లు..!

Best Camera Phones : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? రూ. 20వేల లోపు ధరలో టాప్ 3 బెస్ట్ కెమెరా ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.. ఏ ఫోన్ కొంటారో కొనేసుకోండి.

1/4
Best Camera Phones : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? మీరు కంటెంట్ క్రియేటర్ అయితే ఇది మీకోసమే.. అద్భుతమైన కెమెరా ఫీచర్లతో కొత్త 5G ఫోన్ కోసం చూస్తుంటే ఈ క్రేజీ డీల్స్ అసలు మిస్ చేసుకోవద్దు. భారతీయ మార్కెట్లో ప్రస్తుతం రూ. 20వేల బడ్జెట్ లోపు టాప్ 3 బెస్ట్ కెమెరా ఫోన్లు లభ్యమవుతున్నాయి. ఈ 5G ఫోన్లు బెస్ట్ కెమెరా సెటప్‌తో వస్తాయి. హై రిజల్యూషన్‌లో సులభంగా రికార్డ్ చేయొచ్చు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మీకు నచ్చిన కంటెంట్‌ను ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఈ ఫోన్‌లు పవర్‌ఫుల్ ప్రాసెసర్‌ కలిగి ఉన్నాయి. ఈ ఫోన్‌లలో వీడియోలను ఎలాంటి డిలే లేకుండా ఎడిట్ చేయొచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ బ్యాటరీ కలిగి ఉన్నాయి. సెప్టెంబర్ 2025లో జరిగే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌కు ముందు ఈ ఫోన్‌లను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి అద్భుతమైన డీల్స్ అసలు వదులుకోవద్దు.
2/4
1. మోటోరోలా G85 5G : మోటోరోలా G85 5G ఫోన్ 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50MP+ 8MP డ్యూయల్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. అయితే, ఫ్రంట్ సైడ్ 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. మీరు బ్యాక్ కెమెరా నుంచి లేదా ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేయాలనుకున్నా హై క్వాలిటీ వీడియోలను క్యాప్చర్ చేయొచ్చు. మీరు సోషల్ మీడియాలో కంటెంట్, యూట్యూబ్ ఛానెల్ కోసం సులభంగా వీడియోలను రికార్డ్ చేయవచ్చు. ఈ ఫోన్ 5000mAh లాంగ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. వీడియో ఎడిటింగ్, గేమింగ్ కోసం పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ అందించే స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ప్రస్తుత జాబితా ధర సుమారు రూ. 20,999 ఉంటుంది. కానీ, 23శాతం భారీ తగ్గింపుతో ఈ మోటోరోలా ఫోన్‌ను కేవలం రూ. 15,999కి పొందవచ్చు.
3/4
2. రియల్‌మి P2 ప్రో 5G : రియల్‌మి P2 ప్రో 5G ఫోన్ 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది. 6.7-అంగుళాల ఫుల్ హెచ్‌డి+ డిస్‌ప్లే కూడా ఉంది. ఈ ఫోన్ 5200mAh లాంగ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. సాధారణ వినియోగంతో 2 రోజులు ఛార్జింగ్ వస్తుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఈ ఫోన్‌ను త్వరగా ఛార్జ్ చేయవచ్చు. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 ప్రాసెసర్ కలిగి ఉంది. మల్టీ టాస్కింగ్, గేమింగ్, వీడియో ఎడిటింగ్ కోసం అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. Kinemaster, CapCut వంటి యాప్‌లలో ఈ ఫోన్‌లో మీ అల్ట్రా HD వీడియోలను కూడా ఎడిట్ చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి P2 ప్రో 5G ఫోన్ ప్రస్తుత ధర సుమారు రూ. 25,999 ఉంటుంది. కానీ, 30శాతం భారీ ధర తగ్గింపుతో ఈ ఫోన్‌ను కేవలం రూ. 17,999కి పొందవచ్చు.
4/4
3. టెక్నో పోవా 7 5జీ : టెక్నో పోవా 7 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది. ఈ టెక్నో ఫోన్‌తో 6000mAh బ్యాటరీ కలిగి ఉంది. 2 రోజుల పాటు ఛార్జింగ్ వస్తుంది. బ్యాక్ సైడ్ ఏఐతో కూడిన 50MP మెయిన్ కెమెరా కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 13MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. ఈ బడ్జెట్ రేంజ్‌లో బెస్ట్ కెమెరా ఫోన్‌లలో ఇదొకటిగా చెప్పొచ్చు. 6.78-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమన్షిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ ఉంది. హై-ఎండ్ టాస్క్ కోసం అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతానికి ఈ ఫోన్ ధర సుమారు రూ. 19,999 ఉండగా, 20శాతం ధర తగ్గింపుతో ఈ టెక్నో ఫోన్‌ను కేవలం రూ. 15,999కే పొందవచ్చు.