Bigg Boss Today Promo : న‌రేష్ ఆన్ ఫైర్‌.. నేను ఇంకో 20 వారాలు ఉంటా.. భ‌య‌ప‌డుతున్నారుగా ఉంచుకోండి..

బిగ్‌బాస్‌లో నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన రెండో ప్రొమో (Bigg Boss Today Promo ) వ‌చ్చేసింది.

Bigg Boss Season 10 Telugu Day 22 Promo 2 jabardasth naresh on fire

Bigg Boss Today Promo : బిగ్‌బాస్‌లో నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన రెండో ప్రొమో వ‌చ్చేసింది. నామినేష‌న్స్‌కు సంబంధించి బిగ్‌బాస్ ఓ టాస్క్‌ను ఇచ్చాడు. యుద్ధం ఆయుధాల‌తో జ‌రుగుతోంది. అందుకే మీకు నేను మీ మొద‌టి ఆయుధాన్ని ఇస్తున్నాను. ఈ డాగ‌ర్స్ చాలా కీల‌కం కానున్నాయి. రెండు లేదా అంత‌కంటే ఎక్కువ డాగ‌ర్స్‌ను సంపాదించుకునే యోధులు ఇత‌రుల‌ను భ‌విష్య‌త్తును కూడా నిర్ణ‌యించే అవ‌కాశం పొందుతారు. అని చెప్పుకొచ్చాడు.

కంటెస్టెంట్లు రెండు గ్రూపులు విడిపోయిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో న‌రేష్‌ను రోహిత్ ఎత్తుకుని వెళ్ల‌గా రామ్‌ప్ర‌సాద్.. న‌రేష్ ద‌గ్గ‌రి నుంచి డాగ‌ర్‌ను లాక్కుకుంటాడు. చిన్న‌పిల్లాడిని చేసి లాక్కుకున్నారు అంటూ న‌రేష్ మండిప‌డ్డాడు.

The Paradise collections : బాక్సాఫీస్ వ‌ద్ద ది ప్యార‌డైజ్ జోరు.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లంటే?

ఆ త‌రువాత వాష్ రూమ్‌కు వెళ్లి వ‌స్తున్న ఝాన్సీని వ‌ద్ద డాగ‌ర్‌ను లాక్కుకునేందుకు దేబ్జానీ, షాలినీ, సృష్టిలు ప్ర‌య‌త్నించారు. దీన్ని గ‌మ‌నించిన రోహిత్, వంశీ, రామ్‌ప్ర‌సాద్, అమ‌న్‌ త‌దిత‌రులు ఝాన్సీ ని కాపాడేందుకు ప్ర‌య‌త్నించారు. ఆ త‌రువాత మేము స‌ర‌దాగా చేద్దామ‌న్న దాన్ని ఈ రూమ్‌లో ఝాన్సీమీద‌, రామ్ ప్ర‌సాద్ మీద ప‌డి సీరియ‌స్ చేసింది వాళ్లే కాబ‌ట్టి మేము ఇవ్వం అని కెప్టెన్ అపూర్వ గ‌ట్టిగా చెబుతోంది. ఈ క్ర‌మంలో త్రిగుణ్‌తో ఆమెకు వాగ్వాదం జ‌రిగిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

నాకు నా గేమ్ మీద న‌మ్మకం ఉంది. నేను ఇంకో 20 వారాలు ఇక్క‌డే ఉంటాను. ఇమ్మూనిటికి భ‌య‌ప‌డుతున్నారు కాబ‌ట్టి ఉంచుకోండి అంటూ న‌రేష్ ఫైర్ అయ్యాడు.