Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మొదలయింది.. 16 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే.. ఫుల్ డీటెయిల్స్..
నేటి నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ గా మొదలయింది. నేడు సెప్టెంబర్ 6న గ్రాండ్ లాంచ్ ఈవెంట్ తో నాగార్జున హోస్ట్ గా ఒక్కో కంటెస్టెంట్ ని పిలిచి, వాళ్ళ గురించి పరిచయం చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపించారు. మొత్తం పదహారు మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. ఆరుగురు కామనర్స్, పదిమంది సెలబ్రిటీలు ఎంట్రీ ఇచ్చారు.(Bigg Boss Telugu 10)
- Saketh U
- Published on- September 6, 2026 / 11:13 PM IST
మొదటి కంటెస్టెంట్ గా బెంగాలీ నటి, తెలుగులో సత్యభామ, ఎన్నెన్నో జన్మల బంధం.. పలు సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న దేబ్జానీ మోదక్ ఎంట్రీ ఇచ్చింది.
రెండవ కంటెస్టెంట్ గా అనేక తెలుగు, తమిళ్ సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన త్రిగుణ్ ఎంట్రీ ఇచ్చాడు.
మూడవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష నుంచి వచ్చిన సింగర్ ఝాన్సీ వచ్చింది.
నాలుగవ కంటెస్టెంట్ గా ఇంటర్వ్యూలతో యూట్యూబ్ లో ఫేమ్ తెచ్చుకున్న యాంకర్ సుధీర్ రెడ్డి ఎంట్రీ ఇచ్చాడు.
అయిదవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష ద్వారా నటుడు అమన్ మసూద్ ఎంట్రీ ఇచ్చాడు.
ఆరవ కంటెస్టెంట్ గా కన్నడ సీరియల్ నటి, అష్టాచెమ్మా, అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు.. లాంటి పలు సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకున్న చైత్ర రాయ్ ఎంట్రీ ఇచ్చింది.
ఏడవ కంటెస్టెంట్ గా అందరికి తెలిసిన కమెడియన్, రచయిత జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్ ఎంట్రీ ఇచ్చాడు.
ఎనిమిదవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష నుంచి షాలిని పటేల్ ఎంట్రీ ఇచ్చింది.
తొమ్మిదవ కంటెస్టెంట్ గా పలు సినిమాల్లో విలన్ గా నటించి ఫేమ్ టెంపర్ వంశీ ఎంట్రీ ఇచ్చాడు.
పదవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష నుంచి వచ్చిన మోడల్ సృష్టి ఎంట్రీ ఇచ్చింది.
పదకొండవ కంటెస్టెంట్ గా జబర్దస్త్ ఫేమ్ నరేష్ ఎంట్రీ ఇచ్చాడు.
పన్నెండవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష నుంచి వచ్చిన మహాదేవుని చరణ్ తేజ ఎంట్రీ ఇచ్చాడు.
పదమూడవ కంటెస్టెంట్ గా ఒకప్పటి నటుడు, కమెడియన్ కృష్ణుడు ఎంట్రీ ఇచ్చాడు.
పద్నాలుగవ కంటెస్టెంట్ గా యాంకర్ వర్షిణి ఎంట్రీ ఇచ్చింది.
పదిహేనవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష నుంచి వచ్చిన రోహిత్ వచ్చాడు.
పదహారవ కంటెస్టెంట్ గా కన్నడ నటుడు, తెలుగు సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకున్న నిహార్ ముకేశ్ గౌడ్ ఎంట్రీ ఇచ్చాడు.
Bigg Boss Telugu 10
