Telugu » Photo-gallery » Flipkart Big Billion Days Sale 2025 Oppo Reno 14 Pro Reno 14 K13 Turbo K13 Turbo Pro K13 To Get Huge Discounts Sh
Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్ ఆఫర్లు.. ఒప్పో రెనో 14 సిరీస్, ఒప్పో K13 సిరీస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..
Flipkart Big Billion Days Sale 2025 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఎంట్రీ-లెవల్, మిడ్-రేంజ్ ఫ్లాగ్‌షిప్ మోడళ్లలో ఒప్పో స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ డీల్స్ ఎలా పొందాలంటే?
Flipkart Big Billion Days Sale 2025 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది.
2/5
ఈ సేల్‌కు సంబంధించి ఎంట్రీ లెవల్, మిడ్-రేంజ్ ఫ్లాగ్‌షిప్ అనే 3 కేటగిరీలకు చెందిన స్మార్ట్‌ఫోన్‌లపై భారీ ఆఫర్‌లను అందించనుంది.
3/5
ప్రస్తుతానికి, ఒప్పో నుంచి అత్యంత పాపులర్ అయిన కొన్ని(Flipkart Big Billion Days Sale 2025) ఫోన్‌లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్‌లను అందిస్తోంది. మీరు ఒప్పో రెనో సిరీస్ లేదా ఒప్పో K సిరీస్ ఏదైనా తగ్గింపు ధరకే కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఒప్పో ఫోన్‌లపై అదిరిపోయే డీల్స్ పొందవచ్చు. ఈ ధరలు అన్ని బ్యాంక్ ఆఫర్‌లతో పొందవచ్చు.
4/5
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో ఒప్పో ఫోన్ డీల్స్ : ఒప్పో రెనో 14, ఒప్పో రెనో 14 ప్రో : ఒప్పో రెనో 12GB ర్యామ్ వేరియంట్, 256GBతో కలిపి ఫ్లిప్‌కార్ట్‌లో అసలు ధర రూ.39,999 నుంచి రూ.34,999కు లభ్యమవుతుంది. మరోవైపు, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఒప్పో రెనో 14 ప్రో 5G ఫోన్ 12GB ర్యామ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో లాంచ్ ధర రూ.49,999 నుంచి రూ.45,999 కు తగ్గింది. బేస్ వేరియంట్ ఏఐ పోర్ట్రెయిట్ కెమెరాతో వస్తుంది. అయితే, ప్రో వేరియంట్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌లో 50MP 3.5x టెలిఫోటో షూటర్ కలిగి ఉంది.
5/5
ఒప్పో K13, K13 టర్బో, ఒప్పో K13 టర్బో ప్రో : 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఒప్పో K13 అసలు లాంచ్ ధర రూ.17,999 నుంచి రూ.14,999కు తగ్గింది. అదేవిధంగా, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో 8GB ర్యామ్ వేరియంట్, ఒప్పో K13 టర్బో అసలు ధర రూ.27,999 నుంచి రూ.24,999 తగ్గింపు ధరకు లభ్యమవుతుంది. 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఒప్పో K13 టర్బో ప్రో 8GB ర్యామ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అసలు ధరపై రూ.4వేలు తగ్గింపుతో రూ.33,999కు లభ్యమవుతుంది.