Tirupati Godakalyanam : తిరుపతిలో కనులపండువగా గోదా కల్యాణం.. ఫొటోలు వైరల్
Tirupati Godakalyanam : తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ప్రాంగణంలోని మైదానంలో గోదా కల్యాణోత్సవం కనులపండువగా సాగింది.
- Harish Thanniru
- Published on- January 16, 2026 / 08:02 AM IST
తిరుపతి (Tirupati) లో గోదా కల్యాణోత్సవం (Godakalyanam) గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ప్రాంగణంలోని మైదానంలో కనులపండువగా కల్యాణోత్సవం సాగింది.
తొలుత శ్రీకృష్ణస్వామి, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులను అలంకరించి కల్యాణ వేదికపై వేంచేపు చేశారు.
తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో శ్రీవిష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణం, రక్షాబంధనం, అగ్నిపత్రిష్ఠ తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
గోవింద నామ సంకీర్తనలతో గోదా కల్యాణం ముగిసింది. కల్యాణాన్ని వీక్షించిన భక్తులు తన్మయత్వం చెందారు.
ఈ కల్యాణోత్సవ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, ఎస్పీ సుబ్బారాయుడు, సీవీఎస్వో మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
