Gold Price Today : పడిపోతున్న గోల్డ్ రేటు.. వరుసగా మూడోరోజు భారీగా తగ్గుదల.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
Gold Price Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త. వరుసగా మూడో రోజు బంగారం రేటు భారీగా తగ్గింది.
- Harishth Thanniru
- Published On : March 14, 2026 / 10:52 AM IST
బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతున్న వేళ భారతదేశంలో బంగారం, వెండి రేట్లు క్రమంగా పడిపోతున్నాయి.
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లను, బులియన్ మార్కెట్ ను కుదిపేస్తోంది. ప్రధానంగా బంగారం మీద దీని ప్రభావం చాలా తీవ్రంగా పడింది. పసిడి ధరలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియని పరిస్థితి. అయితే, గత మూడు రోజులుగా గోల్డ్ రేటు భారీగా తగ్గుతూ వస్తోంది. రాబోయే వారం రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.1,030 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 950 తగ్గింది. దీంతో గడిచిన మూడు రోజుల్లో తులం గోల్డ్ పై రూ.3,600 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 50డాలర్లకుపైగా తగ్గుదల చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఔన్స్ గోల్డ్ 5,022 డాలర్ల వద్ద కొనసాగుతుంది.
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండిపై రూ. 10వేలు తగ్గింది. దీంతో గడిచిన మూడు రోజుల్లో కిలో వెండిపై రూ. 20వేలు తగ్గుదల చోటు చేసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,660కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,46,350 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,59,810 వద్దకు చేరగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,46,500 వద్దకు చేరుకుంది. ముంబై, కోల్‌కతా నగరాల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,59,660కు చేరగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,46,350 వద్దకు చేరింది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,59,660 కాగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,46,350 వద్దకు చేరింది.
వెండి ధరలో ఇవాళ భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,80,000 వద్ద చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,70,000వద్ద కొనసాగుతుండగా.. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,80,000 వద్దకు పడిపోయింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
