Gold Silver Price Today : హమ్మయ్య.. బంగారం, వెండి ధరల దూకుడుకు బ్రేక్.. భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. తులం ఎంతంటే?

Gold And Silver Rates Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. ఇవాళ గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి.

1/7
బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. గత వారంరోజులుగా భారీగా పెరుగుతూ వస్తున్న గోల్డ్, సిల్వర్ ధరలకు బ్రేక్ పడింది.
2/7
మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.220 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.200 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 20 డాలర్లు తగ్గింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,631డాలర్ల వద్ద కొనసాగుతోంది.
3/7
వెండి ధరలోనూ భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. కిలో వెండి ధర ఇవాళ భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ. 10వేలు తగ్గుదల చోటు చేసుకుంది.
4/7
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,63,750 వద్దకు చేరగా. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,50,100 వద్ద కొనసాగుతోంది.
5/7
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,63,900 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,50,250 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,63,750కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,50,100 వద్ద కొనసాగుతోంది.
6/7
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,65,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,60,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,65,000 వద్ద కొనసాగుతోంది.
7/7
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.