Gold Silver Rates Today : బంగారం ధరల్లో భారీ మార్పులు.. ఏపీ, తెలంగాణలో నేటి గోల్డ్, సిల్వర్ ధరలు ఇవే..
Gold Silver Rates Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. ఇవాళ గోల్డ్ రేట్లు పెరిగాయి.
- Harish Thanniru
- Published on- September 8, 2026 / 10:59 AM IST
Gold Silver Rates Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. గోల్డ్ రేటు భారీగా పెరిగింది.
గత శనివారంతోపాటు.. సోమవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10గ్రాముల బంగారంపై రెండు రోజుల్లో సుమారు రూ. 2,500 తగ్గింది. అయితే, ఇవాళ మాత్రం గోల్డ్ రేటు భారీగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరగ్గా.. దేశీయంగా వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.
మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 1200 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 1100 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు పెరిగింది. అక్కడ ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 4,428 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. దేశంలో వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,55,350 వద్దకు చేరగా. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,42,400 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,55,500 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,42,550 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,55,350కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,42,400 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,55,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,50,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,55,000 వద్ద కొనసాగుతోంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.
