Gold Rate Today : బంగారం, వెండి ధరల్లో ఊహించని మార్పు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

Gold Rate Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. గోల్డ్, సిల్వర్ ధరల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

1/7
బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. గోల్డ్, సిల్వర్ ధరల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్, అమెరికా దేశాల మధ్య చర్చల సమయంలో బంగారం, వెండి ధరల్లో ఊగిసలాట చోటు చేసుకుంది.
2/7
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచ స్టాక్ మార్కెట్లలో గందరగోళం నెలకొంది. అయితే, ఇరాన్, అమెరికా మధ్య చర్చల ప్రకటనల నేపథ్యంలో బంగారం ధరలు పెరిగాయి.. ప్రస్తుతం ఆ చర్చలు విఫలం కావడంతో గోల్డ్, సిల్వర్ ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
3/7
ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 12డాలర్లు తగ్గింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ రేటు 4,751 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
4/7
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,52,840కాగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,40,100 వద్ద కొనసాగుతోంది.
5/7
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,52,990కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,40,250 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,52,840కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,40,100 వద్ద కొనసాగుతుంది.
6/7
వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,65,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,60,000వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,65,000వద్దకు చేరింది.
7/7
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.