Gold Silver Price Today : కేంద్రం ఎఫెక్ట్.. దిమ్మతిరిగే షాకిచ్చిన గోల్డ్ రేటు.. వామ్మో రికార్డుల మోత.. ఏపీ, తెలంగాణలో ఎంత పెరిగాయంటే..?
Gold Silver Price Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ బిగ్ షాక్. గోల్డ్ రేటు ఒక్కసారిగా పెరిగింది.
- Harish Thanniru
- Published on- May 13, 2026 / 10:23 AM IST
బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ బిగ్ షాక్. గోల్డ్ రేటు ఒక్కసారిగా పెరిగింది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఊహించన స్థాయిలో గోల్డ్ రేటు పెరిగింది.
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతులకు కళ్లెం వేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ రెండు లోహాల దిగుమతులపై సుంకాన్ని 6 నుంచి 15శాతానికి పెంచుతూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం బంగారం ధరలపై ప్రభావం చూపింది. దీంతో గోల్డ్ రేటు ఊహించని స్థాయిలో పెరిగాయి.
బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.13,910 పెరగ్గా .. 22 క్యారెట్ల బంగారంపై రూ. 12,750 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సఉ గోల్డ్ పై 16డాలర్లు తగ్గగా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,699 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి ధర తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా పెరిగింది. ఢిల్లీ తదితర నగరాల్లో కిలో వెండిపై రూ. 30వేలు పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,67,890 వద్దకు చేరగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,53,900 వద్దకు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,68,040కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,54,050 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,67,890కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,53,900 వద్ద కొనసాగుతుంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.3,00,000 వద్దకు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండిపై రూ.20వేలు పెరిగింది. దీంతో అక్కడ ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.3,10,000వద్దకు చేరింది. చెన్నైలో కిలో వెండిపై రూ.30వేలు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ కిలో వెండి రేటు రూ.3,30,000 వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
