Gold silver Price Today : దిగొస్తున్న బంగారం ధర.. గోల్డ్, సిల్వర్ ధరల్లో ఊహించని మార్పులు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

Gold silver Price Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. ఇవాళ బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గోల్డ్ రేటు తగ్గగా.. సిల్వర్ రేటు భారీగా పెరిగింది.

1/7
Gold silver Price Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. గోల్డ్ రేటు మళ్లీ తగ్గింది. అయితే, వెండి రేటు మాత్రం భారీగా పెరిగింది.
2/7
సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 710 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.650 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ 12డాలర్లు తగ్గింది. దీంతో ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ రేటు 4,535 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
3/7
వెండి ధరలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గత మూడు రోజులుగా వెండి ధర తగ్గుతూ వస్తోంది. మూడ్రోజుల్లో కిలో వెండిపై రూ.30వేలు తగ్గింది. అయితే, ఇవాళ (సోమవారం) ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ.10వేలు పెరిగింది.
4/7
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,56,220 వద్దకు చేరగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,43,200 వద్ద కొనసాగుతోంది.
5/7
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,56,370కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,43,350 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,56,220కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,43,200 వద్ద కొనసాగుతుంది.
6/7
వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.3,00,000 వద్దకు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,90,000వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.3,00,000 వద్దకు చేరింది.
7/7
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.