Gold Silver Price Today : అక్షయ తృతీయ ఎఫెక్ట్.. బంగారం ధరల్లో కీలక మార్పులు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
Gold Silver Price Today : అక్షయ తృతీయ రోజున బంగారం ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తులం బంగారంపై స్వల్ప పెరుగుదల చోటు చేసుకుంది.
- Harishth Thanniru
- Updated on- April 19, 2026 / 11:55 AM IST
అక్షయ తృతీయ సందర్భంగా మహిళలు బంగారం కొనుగోలుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఈరోజున బంగారం కొనుగోలుచేస్తే ఆర్థిక శ్రేయస్సు, ఐశ్వర్యం, శాశ్వత సంపద కలుగుతాయని నమ్మకం. అందుకే ధనిక, మధ్య తరగతి కుటుంబాలు, పెట్టుబడిదారులు, వ్యాపారులు అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలుకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. అయితే, ఇవాళ అక్షయ తృతీయ రోజున గోల్డ్ ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.
ఆదివారం బంగారం ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గోల్డ్ రేటు స్వల్పంగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఔన్సు గోల్డ్‌పై సుమారు 50డాలర్లు పెరిగింది. దీంతో అక్కడ ఔన్సు గోల్డ్ 4,833 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర స్వల్పంగా పెరిగింది. దీంతో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,55,780 వద్దకు చేరగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,42,800 వద్దకు కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,55,930కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,42,950 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,55,780కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,42,800 వద్ద కొనసాగుతుంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,80,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,75,000వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,80,000వద్దకు చేరింది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
