Gold Silver Price Today : బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

Gold Silver Price Today : బంగారం, వెండి ధరల్లో శనివారం కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.

1/6
బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గోల్డ్ రేటు స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి ధర భారీగా పెరిగా పెరిగింది.
2/6
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. ఇవాళ ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అంతర్జాతీయ మార్కెట్లో వెండి రేటు పెరిగింది. ఔన్సు బంగారంపై 11డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,709 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి రేటు భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ. 5వేలు పెరిగింది.
3/6
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,53,040 వద్దకు చేరగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,41,200 వద్ద కొనసాగుతోంది.
4/6
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,54,190కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,41,350 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,53,040కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,41,200 వద్ద కొనసాగుతుంది.
5/6
వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,70,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,60,000వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,70,000వద్దకు చేరింది.
6/6
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.