Gold Silver Prices : బంగారం ధరలపై ఆర్బీఐ షాకింగ్ న్యూస్.. వామ్మో అంత పెరుగుతాయా..? ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

Gold Silver Prices : పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం భారత ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా ద్రవ్యోల్బ ణంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) హెచ్చరించింది.

1/8
బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. గత వారం రోజులుగా గోల్డ్ రేటు తగ్గుతూ, పెరుగుతూ వస్తోంది. అయితే, ఇవాళ గోల్డ్, సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
2/8
పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం భారత ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా ద్రవ్యోల్బ ణంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) హెచ్చరించింది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గుప్తా ఇటీవల అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ద్రవ్యోల్బణ ముప్పును గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ద్రవ్యోల్బణం నుండి రక్షణ పొందేందుకు (Inflation Hedge) పెట్టుబడిదారులు బంగారంపై మొగ్గు చూపుతారని ఆర్‌బిఐ హెచ్చరికల నేపథ్యంలో మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
3/8
తాజా పరిణామాల నేపథ్యంలో జూన్ నెల చివరి నాటికి బంగారం ధర 8వేల డాలర్లకు చేరుతుందా అనే అంశంపై మార్కెట్లో ఊహాగానాలు కూడా ఉన్నాయి. అయితే ఇంత భారీ స్థాయికి ధర చేరుకోవడం అసాధ్యమని కొందరు భావిస్తున్నప్పటికీ, యుద్ధ తీవ్రత పెరిగితే పరిస్థితులు వేగంగా మారవచ్చని నిపుణులు చెబుతున్నారు.
4/8
ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. ఇవాళ ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రేటు పెరిగింది. ఔన్సు బంగారంపై 11డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,709 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి రేటు ఇవాళ స్థిరంగా కొనసాగుతోంది.
5/8
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,54,040 వద్దకు చేరగా.. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,41,200 వద్ద కొనసాగుతోంది.
6/8
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,54,190కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,41,350 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,53,040కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ. 1,41,200 వద్ద కొనసాగుతుంది.
7/8
వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,70,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,60,000వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,70,000వద్దకు చేరింది.
8/8
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.