Gold Silver Prices Today : అదిరిపోయే శుభవార్త.. కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. రూ.లక్షకు చేరువలో గోల్డ్ రేటు

Gold Silver Prices Today : బంగారం, వెండి ధరల్లో శనివారం భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.

1/8
Gold Silver Prices Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నవారికి భారీ శుభవార్త. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న ఊహించని పరిణామాలు, మదుపరుల లాభాల స్వీకరణ (ప్రాఫిట్ బుకింగ్) దాటికి బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి.
2/8
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుదల చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో ఔన్సు (31.1గ్రాములు) బంగారం ధర కీలకమైన 4వేల డాలర్ల మార్కు దిగువకు పడిపోయింది. ఇవాళ ఏకంగా ఔన్సు గోల్డ్ రేటు 145 డాలర్లు పడిపోగా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 3,875 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
3/8
శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.3,380 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 3,100 తగ్గింది. దీంతో శుక్ర, శనివారాలతో కలిపి రెండు రోజుల్లో 24క్యారెట్ల బంగారం రూ.5వేలకుపైగా తగ్గింది.
4/8
వెండి ధరలుసైతం భారీగా తగ్గుతున్నాయి. గురు, శుక్రవారాల్లో కిలో వెండిపై రూ.10వేలు తగ్గుదల చోటు చేసుకోగా.. ఇవాళ (శనివారం) కూడా వెండి ధర తగ్గింది. కిలో వెండిపై రూ.10వేలు తగ్గింది. మొత్తంమీద గడిచిన పది రోజుల్లో కిలో వెండిపై రూ. 35వేలు తగ్గుదల చోటు చేసుకుంది. దీపావళి నాటికి మరింత తగ్గుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
5/8
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,38,880 వద్ద కొనసాగుతుండగా.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,27,300 వద్ద కొనసాగుతోంది.
6/8
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,39,030 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,27,450 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,38,880కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,27,300 వద్ద కొనసాగుతోంది.
7/8
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,00,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,00,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,00,000 వద్ద కొనసాగుతోంది.
8/8
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.