Gold Silver Prices Today : ధనత్రయోదశి.. బంగారం ప్రియులకు శుభవార్త.. ఏపీ, తెలంగాణలో గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే..

Gold Silver Prices Today : ధనత్రయోదశి వేళ బంగారం, వెండి కొనుగోలుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త.

1/8
Gold Silver Prices Today : ఇవాళ ధనత్రయోదశి.. ఈ రోజున బంగారం, వెండి కొనుగోలు చేస్తే మంచిదనే భావన ఉంది. దీంతో ఎక్కువ శాతం మంది గోల్డ్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. అలాంటి వారికి బంగారం ధరలు భారీ ఊరటనిచ్చాయి.
2/8
గత నాలుగు రోజులుగా బంగారం ధర రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. సోమవారం నుంచి గురువారం వరకు 24 క్యారెట్ల తులం బంగారంపై సుమారు రూ.9వేలు పెరిగింది. అయితే, ధనత్రయోదశి రోజున అంటే.. ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది. వెండి ధరసైతం భారీగా తగ్గుదల చోటు చేసుకుంది.
3/8
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.2,560 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.2,350 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. అక్కడ ఔన్సు గోల్డ్ పై 40 డాలర్లు తగ్గింది. దీంతో ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,046 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
4/8
గత వారం రోజులుగా స్థిరంగా కొనసాగుతూ వస్తున్న వెండి ధర ఇవాళ భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ. 5వేలు తగ్గింది.
5/8
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,43,460 వద్ద కొనసాగుతుండగా.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,31,500 వద్ద కొనసాగుతోంది.
6/8
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,43,610 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,31,650 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,43,350కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,31,400 వద్ద కొనసాగుతోంది.
7/8
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,05,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,05,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,05,000 వద్ద కొనసాగుతోంది.
8/8
గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.