Allu Arjun : బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మూవీ.!?

మిన్నల్ మురళి ఫేమ్ బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా ఓ సినిమా చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

Gossip Garage is Allu Arjun AA24 movie with Basil Joseph

Allu Arjun : అల్లుఅర్జున్, అట్లీ కాంబినేషన్‌లో పాన్ ఇండియా లెవల్‌లో రూపొందుతున్న రాకా మూవీని 2028లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత బన్నీ లోకేశ్ కనగరాజ్‌తో ఓ ప్రాజెక్ట్స్‌ కమిట్ అయినట్లు చెబుతున్నారు. AA23 వర్కింగ్ టైటిల్ పేరుతో ప్రచారంలో ఉన్న ఆ సినిమా రాకా రిలీజ్ తర్వాత ట్రాక్‌ ఎక్కబోతోందా లేక అంతకంటే ముందే స్టార్ట చేస్తారా అనేది సస్పెన్స్‌గా ఉంది.

ఇంతలో పుష్పరాజ్ నెక్స్ట్ మూవీపై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మిన్నల్ మురళి ఫేమ్ బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కాంబినేషన్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Keerthy Suresh : కొంచెం ఆల‌స్య‌మైంది గానీ.. 80s లుక్స్‌లో కీర్తీ సురేష్.. ఫోటోలు వైర‌ల్‌..

బాసిల్ జోసెఫ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్‌ను కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మిక్స్ చేసే విధానం, అల్లు అర్జున్ పాన్ ఇండియా ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ కాంబినేషన్ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కథ, స్క్రిప్ట్‌కు సంబంధించిన చర్చలు జరిగినట్టు టాక్. ప్రాజెక్ట్‌కు సంబంధించి మరిన్ని విషయాలు క్లారిటీ వచ్చిన తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్, బాసిల్ జోసెఫ్.. గీతా ఆర్ట్స్ కాంబినేషన్ నిజమైతే మాత్రం ఇది మరో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా మారనుంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇది ఇండస్ట్రీ గాసిప్‌గానే చెప్పొచ్చు.