iPhone 17 Launch : కొత్త ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది.. ఆపిల్ ఈ పాత ఐఫోన్ మోడల్స్ ఆపేస్తుందట.. ఫుల్ లిస్టు ఇదిగో..!

iPhone 17 Launch : ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ రాబోతుంది. ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 15, ఆపిల్ వాచ్‌లతో సహా ఇప్పటికే ఉన్న మోడళ్లను కంపెనీ నిలిపివేయవచ్చు.

1/8
iPhone 17 Launch : ఆపిల్ ఐఫోన్ 17 లాంచ్ కాబోతుంది. సెప్టెంబర్ 9న కుపెర్టినోలో జరిగే "అవే డ్రాపింగ్" ఈవెంట్ లో కంపెనీ 4 కొత్త ఐఫోన్ మోడళ్లతో పాటు అనేక ఇతర అప్లియన్సెస్ ఆవిష్కరించే అవకాశం ఉంది. అయితే, ఆపిల్ సంప్రదాయాన్ని కొనసాగిస్తే అదే సమయంలో పాపులర్ ఐఫోన్ మోడళ్లలో కొన్నింటిని కూడా నిలిపివేయవచ్చు.
2/8
ఆపిల్ ఒక ప్రొడక్టు నిలిపివేయడమంటే.. టెక్ దిగ్గజం ఇకపై ఆ డివైజ్ తయారు చేయదు. అధికారిక స్టోర్లు, వెబ్‌సైట్ ద్వారా విక్రయించదు. ఆ ప్రొడక్టు చివరికి మార్కెట్ నుంచి అదృశ్యమైనప్పటికీ, రిటైల్ స్టోర్లు, ఇ-కామర్స్ అవుట్‌లెట్‌లలో మిగిలిన స్టాక్‌లు అమ్ముడవుతాయి. భారీ తగ్గింపుతో కూడా ఈ డివైజ్ లను విక్రయించవచ్చు.
3/8
ఏ ఆపిల్ ప్రొడక్టులను నిలిపివేయవచ్చు? : ఈ ఏడాదిలో ఐఫోన్ 17 లాంచ్ తర్వాత మొత్తం 8 ప్రొడక్టులను ఆపిల్ నిలిపివేసే అవకాశం ఉంది.
4/8
1) ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ : ఆపిల్ లైనప్ నుంచి గత ఏడాదిలో లాంచ్ అయిన ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ నిలిపివేసే అవకాశం ఉంది. సాధారణంగా, ఆపిల్ ఒకే సమయంలో రెండు ప్రో మోడల్ జనరేషన్‌లను విక్రయించదు. అదే జరిగితే ఈ రెండు ఐఫోన్లు మార్కెట్లో కనిపించవు.
5/8
2) ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ : ఈ ఏడాదిలో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్ లాంచ్ కావడంతో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ ఆపిల్ లైనప్‌లో నెక్స్ట్ ఎంట్రీ-లెవల్ ఆప్షన్లుగా మారతాయి. ఆపిల్ 2023లో లాంచ్ అయిన ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్‌లను నిలిపివేసే అవకాశం ఉంది.
6/8
ఈ-కామర్స్ అవుట్‌లెట్‌లలో రాబోయే దీపావళి సేల్ సమయంలో ఈ 2 మోడళ్లు భారీ తగ్గింపుతో విక్రయించే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఆపిల్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ మోడళ్ల ధరలను కూడా తగ్గించవచ్చు.
7/8
3) ఆపిల్ వాచీలు : ఆపిల్ వాచ్ అల్ట్రా 3, కొత్త వాచ్ SE మోడల్ లాంచ్ చేయనుంది. అవే డ్రాపింగ్ ఈవెంట్ తర్వాత కంపెనీ ఆపిల్ వాచ్ అల్ట్రా 2, ఆపిల్ వాచ్ SE (2వ జనరేషన్) నిలిపివేసే అవకాశం ఉంది.
8/8
4) ఎయిర్‌పాడ్స్ ప్రో 2 : ఆపిల్ సెప్టెంబర్ 9న ఇన్-బిల్ట్ హార్ట్ రేట్ ట్రాకింగ్, కొత్త చిప్‌సెట్‌తో ఎయిర్‌పాడ్స్ ప్రో 3ని రిలీజ్ చేయనుంది. కొత్త ఎయిర్‌పాడ్‌ లాంచ్‌తో కంపెనీ లైనప్ నుంచి ఎయిర్‌పాడ్స్ ప్రో 2ని నిలిపివేసే అవకాశం ఉంది. అయితే, ఆపిల్ చౌకైన ధరలో ఎయిర్‌పాడ్స్ ప్రో 2తో మార్కెట్‌లోని మరో సెగ్మెంట్‌కు ఉండాలని నిర్ణయించుకుంటే అలానే ఈ డివైజ్ కొనసాగించే అవకాశం ఉంది.