JD Chakravarthy : అన్నం మానేసి 24 ఏళ్ళు.. జెడి చక్రవర్తి ఫుడ్ గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫుడ్ హ్యాబిట్స్ గురించి చెప్పుకొచ్చాడు.(JD Chakravarthy)
- Saketh U
- Published on- April 27, 2026 / 10:49 AM IST
JD Chakravarthy
JD Chakravarthy : ఒకప్పుడు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి సక్సెస్ చూసిన జెడి చక్రవర్తి గత కొంతకాలంగా అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు జెడి చక్రవర్తి విలన్ గా గాయపడ్డ సింహం అనే సినిమాతో రాబోతున్నాడు. తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా మే 1న రిలీజ్ కానుంది. ప్రస్తుతం జెడి ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.
సెలబ్రిటీలు హెల్త్ కోసం, ఫిట్నెస్ కోసం ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారని తెలిసిందే. అయితే జెడి మాత్రం ఏకంగా 24 ఏళ్లుగా అన్నమే తినట్లేదంట. 56 ఏళ్ళ వయసులో కూడా జెడి ఫుల్ ఫిట్నెస్ గా ఉన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫుడ్ హ్యాబిట్స్ గురించి చెప్పుకొచ్చాడు.
Also Read : Jabardasth Faima : నరేష్ భుజంపై తలవాల్చి.. ఫ్లైట్ లో జబర్దస్త్ ఫైమా, నరేష్ క్లోజ్ ఫొటోలు..
జెడి చక్రవర్తి మాట్లాడుతూ.. నేను రోజుకు గంట కచ్చితంగా జిమ్ చేస్తా. హెల్త్ ఈజ్ వెల్త్ అని నమ్ముతా. నాకు ఫుడ్ ఇష్టం ఉండదు. ఇప్పుడు తినాలా అని ఫీల్ అవుతా. నేను రైస్ తిని ఆల్మోస్ట్ 24 ఏళ్ళు అవుతుంది. తింటే లావు అవుతాను అని కాదు కానీ తినడం మానేశా. చాలా వాటిల్లో కార్బ్స్ ఉంటాయి. రైస్ ద్వారా మాత్రమే కాదు వేరే వాటితో కూడా కార్బ్స్ వస్తాయి. ఫ్రూట్ జ్యూస్ కూడా ఎక్కువ తాగాను.
ఫుడ్ విషయంలో రూల్స్ లేవు ఏది ఉంటే అది తింటా కానీ కంట్రోల్ గా తింటా. ఫుడ్ నాకు బోరింగ్ టాపిక్. నాకు, మా అమ్మకు కూడా ఫుడ్ ఇష్టం ఉండదు. ఫుడ్ గురించి మాట్లాడితే ఇష్టం ఉండదు. మా అమ్మకు వంట రాదు. కాబట్టి చిన్నప్పట్నుంచి నాకు వంటలు ఏమి స్పెషల్ గా చేసిపెట్టలేదు. అందులోను నేను వీగన్ ని. కేవలం వెజిటేరియన్ తింటాను జస్ట్ కడుపు నింపుకోవడానికి మాత్రమే అని చెప్పుకొచ్చాడు. అన్నం తినకుండా ఇన్నేళ్లు మెయింటైన్ చేస్తున్నాడంటే గ్రేట్ అని అభినందిస్తున్నారు.
Also Read : Raviteja : ‘అక్కాయిలు బాగున్నారా’.. అతనితో రవితేజ వెటకారం..?
