యూట్యూబర్ గా తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న 'మెహబూబ్ దిల్ సే'.. తెలుగు నెంబర్ వన్ రియాలిటీ షో బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి బాగానే పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇటీవలే మెహబూబ్ అమ్మగారు చనిపోయిన విషయం తెలిసిందే. కాగా నేడు మెహబూబ్ కుటుంబ సభ్యులతో కలిసి రాజస్థాన్ లోని అజ్మీర్ షరీఫ్ దర్గాని దర్శించుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.