Nothing Phone 3 Price : సూపర్ డిస్కౌంట్ బ్రో.. ఈ నథింగ్ ఫోన్ 3పై ఏకంగా రూ. 33వేలు తగ్గింపు.. అమెజాన్‌లో ఇలా కొన్నారంటే?

Nothing Phone 3 Price : అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్.. నథింగ్ ఫోన్ 3 అతి చౌకైన ధరకే లభిస్తోంది. మీరు ఇలా కొన్నారంటే రూ. 33వేల తగ్గింపుతో ఇంటికి తెచ్చుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

1/7
Nothing Phone 3 Price : కొత్త ఫోన్ కొంటున్నారా? అమెజాన్ ఇండియాలో నథింగ్ ఫోన్ 3 భారీగా తగ్గింపుతో లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ. 79,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. కానీ, ఇప్పుడు ఈ లగ్జరీ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ. 48వేల కన్నా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
2/7
ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ ద్వారా మరింత తగ్గింపు పొందవచ్చు. ఈ మిడ్-రేంజ్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 సీపీయూ, అద్భుతమైన 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, ఫ్లాగ్‌షిప్-లెవల్ డిజైన్ ఉన్నాయి. మిడ్-రేంజ్ ధరలో లగ్జరీ స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తుంటే ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. ఈ డీల్‌ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/7
అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 3 డీల్ : ప్రస్తుతం నథింగ్ ఫోన్ 3 రూ. 46,999 ధరకు లభిస్తోంది. అసలు రిటైల్ ధరపై రూ. 33వేలు ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాదు.. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులతో అదనంగా రూ. 1,500 డిస్కౌంట్‌ కూడా పొందవచ్చు. తద్వారా నథింగ్ ఫోన్ ధర రూ. 45,499కి తగ్గుతుంది.
4/7
అమెజాన్ నెలకు కేవలం రూ. 1,652 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ కూడా అందిస్తోంది. కొనుగోలుదారులు పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్ఛేంజ్ ద్వారా రూ. 33,550 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అయితే, ఫైనల్ ఎక్స్చేంజ్ వాల్యూ అనేది పాత ఫోన్ బ్రాండ్, మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
5/7
నథింగ్ ఫోన్ 3 కొనాలా? వద్దా? : నథింగ్ ఫోన్ (3) 6.67-అంగుళాల HDR10+ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. స్మూత్120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 4,500 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ కూడా అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. గీతలు పడినా ఫోన్ కిందపడినా దెబ్బతినకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 సీపీయూ అమర్చారు. స్టేబుల్ గేమింగ్, మల్టీటాస్కింగ్, రోజువారీ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 16GB వరకు ర్యామ్, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.
6/7
కెమెరాల విషయానికి వస్తే.. : ఈ హ్యాండ్‌సెట్‌లో ట్రిపుల్ 50MP రియర్ కెమెరా ఉంది. ఇందులో 50MP రియర్ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, సింగిల్ 50MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 50MP కెమెరా కూడా ఉంది. వీడియో కాల్స్, సెల్ఫీలకు అద్భుతంగా ఉంటుంది.
7/7
ఇందులో 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5,500 mAh బ్యాటరీ అందిస్తుంది. నథింగ్ ఫోన్ (3) అద్భుతమైన పర్ఫార్మెన్స్, కెమెరాలు, ప్రీమియం డిస్‌ప్లేతో అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. మంచి ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నవారికి ఇదే బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు.