OnePlus 11 5G : వావ్! ఈ వన్‌ప్లస్ 5G ఫోన్ చీపెస్ట్ ధరలో.. ఏకంగా రూ.20వేలు తగ్గింపు!

OnePlus 11 5G : 50MP ట్రిపుల్ కెమెరాలతో వన్‌ప్లస్ 11 5జీ ఫోన్ అత్యంత సరసమైన ధరకే లభిస్తోంది. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.20వేలు తక్కువ ధరకే కొనేసుకోవచ్చు.

1/8
OnePlus 11 5G : కొత్త వన్‌ప్లస్ ఫోన్ కొంటున్నారా? ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 11 5జీ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. 2023లో లాంచ్ అయిన ఈ ఫోన్ అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 56,999 ధరకు అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇదే వన్‌ప్లస్ ఫోన్ మీ బడ్జెట్ ధరలోనే కొనేసుకోవచ్చు.
2/8
ఈ వన్‌ప్లస్ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరా ఉంది. 100W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. లాంగ్ బ్యాటరీ లైఫ్‌ అందిస్తుంది. ఈ ఫోన్‌పై బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్లను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/8
వన్‌ప్లస్ 11 5జీపై భారీ తగ్గింపు : ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 11 5జీ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. 35శాతం తగ్గింపుతో కేవలం రూ. 38,948కే లభిస్తోంది. అంటే.. బ్యాంక్ ఆఫర్లతో నేరుగా రూ. 18వేలు తగ్గింపు పొందవచ్చు.
4/8
బ్యాంక్ ఆఫర్లు : మీరు వన్‌ప్లస్ 11 5జీపై బ్యాంక్ ఆఫర్లను కూడా పొందవచ్చు. లిస్టింగ్ ప్రకారం.. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో ఫోన్‌ కొనుగోలు చేస్తే.. రూ. 1,948 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ఈ ఫోన్ ధర రూ. 37వేలకు తగ్గుతుంది. సుమారుగా రూ. 22వేలు తగ్గింపు పొందవచ్చు.
5/8
వన్‌ప్లస్ 11 5జీ స్పెసిఫికేషన్లు : ఈ వన్‌ప్లస్ 11 5జీ ఫోన్ 6.7-అంగుళాల క్వాడ్ HD+ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. రిజల్యూషన్ 3216x1440 పిక్సెల్స్, రిఫ్రెష్ రేట్ 120Hz అందిస్తుంది. 4nm ప్రాసెసింగ్‌పై ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌తో రన్ అవుతుంది.
6/8
ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. 5,000mAh బ్యాటరీ ఉంది. 100W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. సేఫ్టీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అందిస్తుంది.
7/8
బ్యాక్ సైడ్ ఎఫ్/1.8 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 48MP అల్ట్రా-వైడ్ కెమెరా, 32MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి.
8/8
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. కొలతల పరంగా ఈ ఫోన్ 163.1 మిమీ పొడవు, 74.1 మిమీ వెడల్పు, 8.53 మిమీ మందం, 205 గ్రాముల బరువు ఉంటుంది.