My OPPO Diwali Raffle Sale : ఒప్పో అభిమానులకు గుడ్ న్యూస్.. కొత్త ఒప్పో ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఒప్పో ఇండియా గ్రాండ్ ఫెస్టివ్ సేల్ 2025 ప్రకటించింది. ఈ సేల్ సందర్భంగా భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, అనేక రివార్డులు ఉన్నాయి. ఈ సేల్ సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 31, 2025 వరకు అందుబాటులో ఉంటుంది.
2/9
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో ఒప్పో F31 సిరీస్, ఒప్పో రెనో 14 సిరీస్, ఒప్పో A సిరీస్, ఒప్పో K సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు టాబ్లెట్‌లు, ఆడియో డివైజ్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఆసక్తిగల కొనుగోలుదారులు 8 నెలల వరకు వడ్డీ లేని ఈఎంఐలు, ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై 10శాతం క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో జీరో డౌన్ పేమెంట్ కూడా పొందవచ్చు.
3/9
కొనుగోలుదారులకు మై ఒప్పో దీపావళి రాఫెల్ (My OPPO Diwali Raffle) రూ. 10 లక్షల నగదు, రోజువారీ రూ. 1 లక్ష బహుమతులు లేదా ఫైండ్ X8, రెనో14, F31 ప్రో, ఎన్కో బడ్స్ 3 ప్రో వంటి లేటెస్ట్ ఒప్పో ఫోన్లను గెలుచుకోవచ్చు. ఈ ఆఫర్లు రిటైల్ స్టోర్లు, ఒప్పో ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో అందుబాటులో ఉంటాయి. ఒప్పో స్మార్ట్‌ఫోన్‌లు, ఇయర్‌బడ్‌లు మరిన్నింటిపై అనేక డిస్కౌంట్లను పొందవచ్చు.
4/9
ఒప్పో రెనో 14, రెనో 14 ప్రో : ఒప్పో అద్భుతమైన కెమెరా ఫోన్ కోసం చూస్తుంటే.. ఒప్పో రెనో 14 ఫోన్ అసలు ధర రూ.39,999 నుంచి 12GB ర్యామ్, 256GB ర్యామ్ ధర రూ.34,999కు లభిస్తుంది.
5/9
మరోవైపు, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఒప్పో రెనో 14 ప్రో 5జీ ఫోన్ 12GB ర్యామ్ వేరియంట్ రూ.45,999కు లభిస్తుంది. లాంచ్ ధర రూ.49,999 నుంచి రూ.45,999కు లభిస్తుంది.
6/9
ఒప్పో F31 సిరీస్ : ఒప్పో F31 ప్రో ప్లస్, F31 ప్రో, ఒప్పో F31 బ్యాంక్ ఆఫర్లతో రూ.20,700 ప్రారంభ ధరకు లభిస్తాయి. అదనంగా, కొనుగోలుదారులు 8 నెలల వరకు జీరో డౌన్ పేమెంట్, వడ్డీ లేని ఈఎంఐ, 10శాతం వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు.
7/9
ఒప్పో A సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు : ఒప్పో A సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో పర్ఫార్మెన్స్ పరంగా ఒప్పో A5x, A5x 5G, A5 5G, A5 ప్రో 5Gలతో సహా ఒప్పో ఎ సిరీస్ కేవలం రూ. 8,999కు ప్రత్యేక ప్రారంభ ధరకు లభిస్తుంది.
8/9
ఒప్పో K13x 5జీ, K13 టర్బో సిరీస్ : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా ఒప్పో K సిరీస్, ఒప్పో ఎన్కో బడ్స్ 3 ప్రో, ఒప్పో ప్యాడ్ ఎస్ఈలపై కూడా భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఒప్పో K13x 5జీ, ఒప్పో K13 టర్బో సిరీస్ కేవలం రూ.9,999 ప్రారంభ ధరకు లభిస్తాయి.
9/9
అదనంగా, కొనుగోలుదారులు ఒప్పో ప్యాడ్ ఎస్ఈ ధర రూ.9,900కి, ఎన్కో బడ్స్3 ప్రో కేవలం రూ.1,499కి పొందవచ్చు.