Telugu » Photo-gallery » Pawan Kalyan Received Special Honor In Karnataka Udupi Photos Goes Viral Sy
Pawan Kalyan : మోకాళ్లపై కూర్చొని సన్మానం తీసుకున్న పవన్.. ఏకంగా ఆ బిరుదుతో సత్కారం.. కర్ణాటకలో పవన్ రేంజ్ ఇది..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా కర్ణాటకలోని ఉడుపి శ్రీ కృష్ణుడిని దర్శించుకున్నారు. ఉడుపి క్షేత్రంలో నిర్వహించిన ‘బృహత్ గీతోత్సవ’ కార్యక్రమంలో పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం మఠాధిపతి పరమ పూజ్య శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కి ‘అభినవ కృష్ణదేవరాయ’ అనే బిరుదుని పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం మఠాధిపతి పరమ పూజ్య శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ ప్రదానం చేసి సత్కరించారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ చేస్తూ కర్ణాటకలో కూడా పవన్ హవా నడుస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. మోకాళ్లపై కూర్చొని మరీ పవన్ సన్మానం స్వీకరించడంతో పవన్ ఎంత ఎదిగినా ఒదిగే ఉంటాడని, ఆయన సింప్లిసిటీ అని, దైవంకు ఇచ్చే గౌరవం అని అంటున్నారు నెటిజన్లు.