Anna Konidala : భర్తను ఫాలో అయిన భార్య.. పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల మంచిమనుసు..
ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ భార్యని అందరూ మెచ్చుకుంటున్నారు. (Anna Konidala)
- Saketh U
- Updated on- August 1, 2026 / 08:29 AM IST
Anna Konidala
Anna Konidala : పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా అందరికి పరిచయమే. గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా ఫొటోలు, జిమ్, ఫుడ్, ఇండియన్ కల్చర్ కి సంబంధించిన విషయాలు షేర్ చేస్తూ పవన్ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. రష్యా మహిళ అయినా మన దేశ సాంప్రదాయాలు పాటిస్తూ పూజలు చేస్తూ, సాంప్రదాయంగా కనిపిస్తూ అందర్నీ మెప్పిస్తున్నారు. ఇప్పటికే అన్నా కొణిదెలని అందరూ అభినందిస్తున్నారు.
ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ భార్యని అందరూ మెచ్చుకుంటున్నారు. తాజాగా అన్నా కొణిదెల హైదరాబాద్ జూ పార్క్ లో రెండు జంతువులను దత్తత తీసుకుంది. ఆసియా ఏనుగు, రాయల్ బెంగాల్ టైగర్ లను అన్నా కొణిదెల దత్తత తీసుకుంది. వీటికి కావాల్సిన ఫుడ్, మెడికల్, ఇతర ఖర్చులు, ఆ రెండు జంతువుల బాగోగులు ఇక నుంచి అన్నా కొణిదెల చూసుకోనున్నారు.
Also Read : Patriotic Movies : రెడీ అవుతున్న దేశభక్తి సినిమాలు.. బాలీవుడ్ టు టాలీవుడ్..
జూ పార్క్ లో ఈ జంతువులు ఉండే ప్రదేశంలో అన్నా కొణిదెల వీటిని దత్తత తీసుకున్నట్టు బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని అన్నా కొణిదెల తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలిపారు. గతంలో పవన్ కళ్యాణ్ వైజాగ్ జూలో జిరాఫీలను దత్తత తీసుకున్న సంగతి తెల్సిందే. భర్తని ఫాలో అవుతూ అన్నా కొణిదెల కూడా లా దత్తత తీసుకోవడంతో ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు, నెటిజన్లు ఆమెని అభినందిస్తున్నారు.
