Anirudh : అనిరుధ్‌కు గాడ్ ఆఫ్ వార్ సెగ.!?

గాడ్ ఆఫ్ వార్ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ రవిచందర్ (Anirudh ) పనిచేస్తుండటంతో..వివాదం ఎటు దారి తీస్తుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.

Pressure to Music Director Anirudh Jr NTR God of War

Anirudh : గాడ్ ఆఫ్ వార్.. ఎన్నో ట్విస్టుల తర్వాత ఎట్టకేలకు ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న మూవీ. ఇలా అనౌన్స్‌మెంట్‌ వచ్చిందో లేదో.. అలా కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. గాడ్‌ ఆఫ్‌ వార్ సుబ్రహ్మణ్యస్వామి కథ ఆధారంగా తీస్తారన్న టాక్‌తో తమిళుల నుంచి సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

గాడ్ ఆఫ్ వార్‌తో పాటు, ధనుష్ చేస్తున్న మురుగన్ సినిమా ఒకే సబ్జెక్ట్ చుట్టూ తిరుగుతున్నాయనే టాక్ నడుస్తోంది. అయితే ఈ డిబేట్ ఒక్కసారిగా హీటెక్కడానికి మెయిన్ రీజన్ ప్రొడ్యూసర్ నాగవంశీ చేసిన ట్వీటేనని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఆయన ట్వీట్‌లో మురుగన్ నార్త్ దేవుడు అని ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటంతో, తమిళ్ ప్రేక్షకులు తీవ్రంగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మురుగన్ తమిళ్ ప్రజల ఆరాధ్య దేవుడు అంటూ తమ అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేస్తున్నారు.

Lirisha reddy : చెట్టు కింద పుస్త‌కం చ‌దువుతున్న సూప‌ర్ ఉమెన్‌.. లిరీష ఫోటోలు వైర‌ల్‌..

అయితే తమిళ్ వర్గాల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్న గాడ్ ఆఫ్ వార్ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ రవిచందర్ పనిచేస్తుండటంతో..వివాదం ఎటు దారి తీస్తుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. తమిళ్ ఇండస్ట్రీకి చెందిన అనిరుద్, తమ భావోద్వేగాలకు వ్యతిరేకంగా ఉన్న ప్రాజెక్ట్‌కు ఎలా పనిచేస్తాడు.? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు తమిళులు.

దీంతో అనిరుద్‌ ఫుల్ ప్రెజర్‌గా ఫీల్‌ అవుతున్నట్లు టాక్. అయితే ధనుష్ చేస్తున్న తమిళ్ మురుగన్ సినిమాకు మాత్రం ఆడియన్స్ నుంచి ఫుల్ సపోర్ట్ పెరుగుతుండటం ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాలతో అనిరుద్‌పై ఒత్తిడి, వ్యతిరేకత పెరుగుతోందా.? లేక ఇవన్నీ సోషల్ మీడియా హైప్ మాత్రమేనా.? అనేది రాబోయే రోజుల్లో మరింత క్లారిటీ రానుంది.