Lenin : అక్కడ రిలీజ్ చేయకపోవడమే ‘లెనిన్’కి ప్లస్ అయిందా? ఇకపై టాలీవుడ్ ఇదే ఫాలో అవుతుందా?
మన సినిమాలకు ఉన్న పెద్ద సమస్యలలో పైరసీ ఒకటి. (Lenin)
Lenin
Lenin : సినిమా ఎన్ని ఎక్కువ చోట్ల రిలీజ్ చేస్తే అంత రీచ్, ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని భావిస్తారు. అందుకే ఇటీవల మన టాలీవుడ్ కుదిరినన్ని దేశాల్లో, తెలుగు వాళ్ళు ఉన్న దేశాల్లో సినిమాలు రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఓవర్సీస్ మార్కెట్ కూడా ఇప్పుడు బాగానే పెరిగింది. అయితే లెనిన్ సినిమాని ఓ దేశంలో రిలీజ్ చేయకపోవడమే ప్లస్ అయిందంటున్నారు.
మన సినిమాలకు ఉన్న పెద్ద సమస్యలలో పైరసీ ఒకటి. ఇక్కడ లోకల్ లో డైరెక్ట్ సినిమా లీక్ అయ్యే ఛాన్సులు చాలా తక్కువ. థియేటర్లో షూట్ చేసే కొన్ని ప్రింట్స్ మాత్రం వస్తాయి. కానీ మంచి ప్రింట్స్ తో కూడా సినిమా రిలీజ్ అయిన మొదటి ఆటకే పైరసీ సైట్స్ లో సినిమాలు ఉంటున్నాయి. ఇది ఎక్కువగా సినిమాలను ఓవర్సీస్ లో సెన్సార్ కి పంపినప్పుడే లీక్ అయి పైరసీ అవుతాయని సమాచారం. అమెరికా లేదా, యూఏఈ, గల్ఫ్ దేశాలకు సెన్సార్ కి పంపినప్పుడు ఈ మధ్యలో సినిమా లీక్స్ ఎక్కువగా జరుగుతాయని టాలీవుడ్ తో పాటు, కేరళ, హిందీ పరిశ్రమల వాళ్ళు కూడా నమ్ముతారు. అలా లీక్ అయిన సంఘటనలు కూడా ఉన్నాయి.
Also Read : Deepa Thomas : రావు బహదూర్ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన హీరోయిన్ దీపా థామస్..
అయితే లెనిన్ సినిమాని గల్ఫ్ దేశాల్లో రిలీజ్ చేయలేదు. కొన్ని రోజుల తర్వాత రిలీజ్ చేద్దామనే ఉద్దేశంతో అక్కడకు సెన్సార్ కి కూడా పంపలేదు. దీంతో లెనిన్ పైరసీ కాపీ బయటకు ఎక్కువగా రాలేదు అని తెలుస్తుంది. ఇక్కడ లోకల్ థియేటర్ ప్రింట్ కొన్ని పైరసీ సైట్స్ లోకి వచ్చేసినా మంచి ప్రింట్ మాత్రం ఏ పైరసీ సైట్స్ లోను రాలేదని తెలుస్తుంది. దీంతో ఇది లెనిన్ కలెక్షన్స్ కి కూడా కలిసి వచ్చిందని అభిప్రాయ పడుతున్నారు. వేరే సినిమాలకు జరిగినంతగా లెనిన్ సినిమాకు పైరసీ జరగలేదని మూవీ యూనిట్ సమాచారం.
గతంలో లెనిన్ నిర్మాత నాగవంశీ కూడా ఓ ఇంటర్వ్యూలో.. గల్ఫ్ దేశాలకు సెన్సార్ కి పంపినప్పుడే సినిమా లీక్ ఎక్కువగా జరుగుతుందని అన్నారు. అందుకే ఈ సారి లెనిన్ రిలీజ్ గల్ఫ్ దేశాల్లో ఆపినట్టు సమాచారం. ఇదే నిజమై వర్క్ అవుట్ అయితే ఇకపై టాలీవుడ్ సినిమాలు కూడా ఇదే పద్ధతి ఫాలో అవ్వడం ఖాయం.
