Sam Curran : ఇంగ్లండ్ యువ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన స్నేహితురాలు ఇసాబెల్లెను మనువాడనున్నాడు. ఈ మేరకు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఐపీఎల్ 2026కు ముందు జరిగిన ట్రేడ్ డీల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్‌లోకి వెళ్లాడు.