Rashmika Mandanna : బహుశా జీవితం అంటే ఇదేనేమో.. పిచ్చివాళ్లలా, భయానకంగా.. ర‌ష్మిక ఫోటోలు వైర‌ల్..

ఇటీవ‌ల ఓ డ్యాన్స్ షూటింగ్‌లో ర‌ష్మిక (Rashmika Mandanna) గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. డాక్ట‌ర్లు ఆమెకు ఆరు వారాల విశ్రాంతి అవ‌స‌రం అని చెప్పారు. దీంతో ప్ర‌స్తుతం ఆమె ఇంట్లోనే రెస్టు తీసుకుంటుంది. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం త‌న జీవితం ఇలా ఉందంటూ కొన్ని ఫోటోల‌ను షేర్ చేసింది. 'నేను ఇంత ఎక్కువ కాలం ఇంట్లోనే ఉన్నప్పుడు నా రోజులు ఎప్పుడూ ఇలాగే గడుస్తాయి. నిరంతరం పరుగులతో బిజీగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవడం అనేది భయానకంగా అనిపిస్తుంది.. కానీ పరిస్థితుల వల్ల విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చినప్పుడు, పిచ్చివాళ్లలా పరిగెత్తడం భయానకంగా అనిపిస్తుంది.. బహుశా జీవితం అంటే ఇదేనేమో.. అపారమైన ప్రేమ, సానుకూలత, ప్రార్థనలు, కృతజ్ఞతా భావాల మధ్య గడపడం ఎంతో అద్భుతంగా ఉంది. 'అంటూ ర‌ష్మిక రాసుకొచ్చింది.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8