×
Ad

సమంత, నందిని రెడ్డి మ్యాజిక్ రిపీట్..! ‘మా ఇంటి బంగారం’ షూటింగ్ షురూ.. మీరు చూడాల్సిన ఫొటోలు ఇవిగో..

"ఓ బేబీ" లాంటి సూపర్‌హిట్ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన నటి సమంత, దర్శకురాలు నందిని రెడ్డి కాంబినేషన్ మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేసేందుకు సిద్ధమైంది. వీరిద్దరి కలయికలో రూపొందుతున్న తాజా చిత్రం "మా ఇంటి బంగారం" లాంఛనంగా ప్రారంభమైంది. సమంత తన సొంత నిర్మాణ సంస్థ 'ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌'పై నిర్మిస్తున్న రెండో ప్రాజెక్ట్ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని సమంతతో పాటు రాజ్ నిడిమోరు, హిమాంక్‌ దువ్వూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గత అక్టోబర్ 2న, దసరా పర్వదినం రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. తాజాగా, ఈ సినిమా ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫొటోలను సమంత విడుదల చేసింది. ఈ ఫొటోల్లో సమంతతో పాటు దర్శకురాలు నందిని రెడ్డి, నిర్మాత రాజ్ నిడిమోరు ఉన్నారు.

  • Publish Date - October 27, 2025 / 07:20 PM IST
1/4
2/4
3/4
4/4