Sanchita Ugale : ఆత్మహత్య చేసుకున్న సీరియల్ నటి.. నెటిజన్ల అనుమానం..

బాలీవుడ్ నటి సంచిత ఉగలే జూన్ 14 ఆదివారం రాత్రి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకొని మరణించింది.

  • Updated on- June 15, 2026 / 04:35 PM IST
1/15
ఆత్మహత్య చేసుకున్న సీరియల్ నటి.. నెటిజన్ల అనుమానం..
2/15
బాలీవుడ్ నటి సంచిత ఉగలే జూన్ 14 ఆదివారం రాత్రి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకొని మరణించింది.
3/15
కుంకుమ్ భాగ్య , వాగ్లే కి దునియా, సాజన్ ఘర్, దిల్వాలీ దుల్హా లే జాయేగీ.. వంటి పలు టీవీ సీరియల్స్, షోలతో సంచిత మంచి గుర్తింపు తెచ్చుకుంది.
4/15
ఛావా, సైలెన్స్ 2: ది నైట్ ఔల్ బార్ షూటౌట్,, వంటి పలు సినిమాల్లో కూడా సంచిత చిన్న చిన్న పాత్రలు చేసింది.
5/15
నటి సంచితా ఉగలే మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని నల్లసోపారా ప్రాంతంలోని తన నివాసంలో ఆదివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నేడు సోమవారం తెలిపారు.
6/15
తన కుమార్తె మరణంలో ఎలాంటి కుట్ర జరిగిందని, మాకు ఏ అనుమానాలు లేవు అని నటి తండ్రి అచోలే పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
7/15
మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.
8/15
అయితే ఆమె సోషల్ మీడియాలో నిన్న చివరగా ఆనందంగా డ్యాన్స్ చేసిన వీడియో పోస్ట్ చేసింది.
9/15
కానీ ఆ వీడియో కింద కొన్ని కామెంట్స్ రెండు రోజుల క్రితం పెట్టినట్టు ఉండటంతో పలువురు నెటిజన్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని, పోలీసులు దీనిపై విచారణ చేయాలని, ఇది ఆతహత్యా కాదా అనేది తేల్చాలని కామెంట్స్ చేస్తున్నారు.
10/15
ఆమె వయసు 30 సంవత్సరాలే అని సమాచారం. ఇంత చిన్న వయసులోనే నటి సంచిత ఇలా ఆత్మహత్య చేసుకొని మరణించడంతో ఆమె అభిమానులు, నెటిజన్లు బాధ వ్యక్తం చేస్తూ ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.
11/15
12/15
13/15
14/15
15/15
Sanchita Ugale