×
Ad

Supritha : అమ్మ మీద డ్రగ్స్, నా మీద బెట్టింగ్ యాప్స్ ఆరోపణలు.. అమ్మకు ఏమైనా అయితే.. ఎమోషనల్ అయిన సుప్రీత..

నటి సురేఖవాణి పై గతంలో డ్రగ్స్ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. (Supritha)

Supritha

Supritha : సీనియర్ నటి సురేఖవాణి పై గతంలో డ్రగ్స్ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియాలో, టీవీలో ఫేమ్ తెచ్చుకొని ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. సుప్రీత సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంతో ఆమెపై కూడా కేసు నమోదయింది. తాజాగా సుప్రీత ఓ ఇంటర్వ్యూలో వీటిపై స్పందిస్తూ ఎమోషనల్ అయింది.(Supritha)

Also Read : Supritha : శివాజీకి వ్యాఖ్యలపై సుప్రీత కామెంట్స్.. అబ్బాయిలు అండర్‌వేర్ మీద తిరగరు కదా..

సుప్రీత మాట్లాడుతూ.. అమ్మ మీద డ్రగ్స్, నా మీద బెట్టింగ్ యాప్స్ ఆరోపణలు వచ్చాయి. అవి తర్వాత రాంగ్ అని ప్రూవ్ అయ్యాయి. అసలు జనాలు ఎవరూ ఆలోచించరు. అమ్మ మీద డ్రగ్స్ ఆరోపణలు వచ్చినప్పుడు ఆ రోజు మీడియా వాళ్ళు మా ఇంటి కిందకి వచ్చేసారు. ఆ రోజు మా అమ్మకు పానిక్ అటాక్స్ వచ్చేసాయి. కాళ్ళు చేతులు వణుకుతూ కూర్చుండిపోయింది. ఆ రోజు ఆమెకు ఏమైనా అయితే ఎవరైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా?

ఆమె డ్రగ్స్ కేసులో ఎఫెక్ట్ అయింది. నేను బెట్టింగ్ యాప్స్ లో ఎఫెక్ట్ అయ్యాను. బెట్టింగ్ యాప్స్ లో నేను చేసింది తప్పే. తెలియకుండానే చేశాను. పోలీసులకు కూడా అదే చెప్పాను. కానీ నేను బతుకుతుందే దాని మీద అన్నట్టు మాట్లాడారు. ఆ బెట్టింగ్ యాప్స్ ఓనర్ బాగానే ఉన్నాడు. మేము ఎఫెక్ట్ అయ్యాము. ఇలాంటి స్ట్రగుల్స్ అన్ని చూసి రాయిలా తయారు అయ్యాను అని ఎమోషనల్ అవుతూ తెలిపింది.

Also See : Sai Pallavi : సాయి పల్లవి జపాన్ వెకేషన్.. మంచులో ఎంజాయ్ చేస్తూ.. ఫోటోలు వైరల్..