Tollywood Actress : చైనాలో డాక్టర్ చదివింది.. హీరోయిన్‌గా వరుస సినిమాలు.. కానీ సొంత కార్ లేదంట ఈ హీరోయిన్ కి..

ఈ హీరోయిన్ ఇండస్ట్రీకి వచ్చి ఆరేళ్ళు అయినా, వరుస సినిమాలు చేస్తున్నా సొంత కార్ లేదంట. (Tollywood Actress)

  • Published on- August 13, 2026 / 12:29 PM IST

Tollywood Actress

Tollywood Actress : ఇప్పటి హీరోయిన్స్ ఒక్క సినిమా చేస్తేనే లగ్జరీ కార్ లో తిరుగుతారు, ఖరీదైన బట్టలు వేస్తారు. ఒక మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారు. కానీ ఈ హీరోయిన్ ఇండస్ట్రీకి వచ్చి ఆరేళ్ళు అయినా, వరుస సినిమాలు చేస్తున్నా సొంత కార్ లేదంట.

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు కామాక్షి భాస్కర్ల. మన తెలుగమ్మాయే. కామాక్షి భాస్కర్ల చైనాకు వెళ్లి MBBS చదివి వచ్చింది. ఇక్కడకు వచ్చి ఓ హాస్పిటల్ లో జాబ్ చేస్తూనే మోడలింగ్ రంగం వైపుకు వెళ్లి మిస్ ఇండియా తెలంగాణా గెలుచుకుంది. అనంతరం థియేటర్ ఆర్ట్స్ చేస్తూనే సినిమాలు ట్రై చేసింది.

Also Read : Sukriti Veni : సుకుమార్ కూతురు సుకృతి వేణి సాధించిన మరో ఘనత.. అమెరికా మ్యూజిక్‌ స్కూల్‌ నుంచి..

మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కామాక్షి భాస్కర్లకు మా ఊరి పొలిమేర సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. అక్కడ్నుంచి వరుసగా హీరోయిన్ గా, కీలక పాత్రల్లో సినిమాలు చేస్తూనే ఉంది. ఇప్పుడు కామాక్షి భాస్కర్ల కీలక పాత్రలో నటించిన అగధ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయం తెలిపింది.

కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ.. మాది చిన్నపట్నుంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే. నాకు అలా ఉండటమే ఇష్టం. అందుకే ఇప్పటికి కూడా బైక్ మీదే వెళ్తాను బయటకు. నాకు సొంత కార్ లేదు. అందరు కొనుక్కోమని చెప్తారు కానీ నాకు అలా మెయింటైన్ చేయడం రాదు. చిన్నపుడు కూడా నాన్న బైక్ మీదే స్కూల్ కి వెళ్ళేవాళ్ళం. చైనాలో కూడా స్కూటీ మీదే వెళ్లేదాన్ని. ఇప్పుడు షూటింగ్స్ సమయంలో ప్రొడక్షన్ వాళ్ళు కార్ పంపిస్తారు కాబట్టి తప్పదు. కానీ బండి మీద వెళ్తుంటే నన్ను గుర్తుపడుతున్నారు. నా వెనకాల పడుతున్నారు. అందుకే త్వరలో కార్ కొనుక్కోవాలి అనుకుంటున్నాను. తప్పక కొనాల్సి వస్తుంది అని తెలిపింది. ఇన్ని సినిమాలు చేసి, ఇంత ఫేమ్ తెచ్చుకొని కూడా సొంత కార్ లేకుండా మెయింటైన్ చేస్తుందంటే కామాక్షిని అభినందించాల్సిందే.

Also See : Soniya Singh : నీలాకాశం నా చుట్టూ కప్పినట్లు అనిపిస్తోంది.. సింపుల్ గా చీరలో సోనియా సింగ్ ఫోటోలు..