Flipkart Freedom Day Sale : వావ్.. కిర్రాక్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో వివో V50పై భారీగా తగ్గిందోచ్.. జస్ట్ ఎంతంటే?

Flipkart Freedom Day Sale 2026 : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ డే సేల్ 2026 సందర్భంగా వివో వి50 ఫోన్ రూ. 7వేలు తగ్గింపుతో లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

1/7
Flipkart Freedom Day Sale 2026 : వివో లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్.. మీరు మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఈ అద్భుతమైన డీల్ మీకోసమే.. వివో V50 ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ వివో ఫోన్ అసలు ధర రూ. 39,999 ఉండగా ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ డే సేల్ 2026 సందర్భంగా ప్రస్తుతం భారీ తగ్గింపుతో లభిస్తోంది. డైరెక్ట్ డిస్కౌంట్ మాత్రమే కాదు.. బ్యాంక్ కార్డు ఆఫర్లతో ధర మరింత తగ్గించుకోవచ్చు.
2/7
ఈ స్మార్ట్‌ఫోన్ 6.77-అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌తో వస్తుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ 50MP సెన్సార్‌తో వస్తుంది. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. ఈ వివో ఫోన్ సొంతం చేసుకోవాలంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. ఫ్లిప్‌కార్ట్‌లో వివో V50 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/7
వివో V50 ఫ్లిప్‌కార్ట్ డీల్ : ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో వివో V50 ఫోన్ రూ. 32,989 ధరకు లభిస్తోంది. ఈ ఫోన్ ధరపై రూ. 7,010 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్, ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో అదనంగా రూ. 1,650 డిస్కౌంట్‌ పొందవచ్చు. తద్వారా అసలు ధర నుంచి నేరుగా రూ. 31,339కి తగ్గుతుంది.
4/7
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ 36 నెలల కాలానికి నెలకు కేవలం రూ. 1,160 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌లను అందిస్తోంది. అప్‌గ్రేడ్ చేసుకునే కస్టమర్లకు ఈ ప్లాట్‌ఫామ్ ఎక్స్ఛేంజ్ బోనస్‌ కూడా అందిస్తోంది. మీ పాత ఫోన్ బ్రాండ్ మోడల్, పర్ఫార్మెన్స్ బట్టి రూ. 23,650 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందవచ్చు.
5/7
వివో వి50 కొనాలా? వద్దా? : ఈ వివో V50 ఫోన్ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు అందిస్తుంది. 6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో అద్భుతమైన వాల్యూను అందిస్తుంది. ఈ స్క్రీన్ గరిష్టంగా 4,500 నిట్స్ బ్రైట్‌నెస్ చేరుకోగలదు. తద్వారా డిస్‌ప్లేపై నేరుగా కాంతిపడినా స్పష్టంగా కనిపిస్తుందని కంపెనీ పేర్కొంది.
6/7
ఇంటర్నల్ స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే.. ఈ వివో ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్ అందిస్తుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్, ఏఐ ఫంక్షనాలిటీలతో వస్తుంది. అంతేకాదు.. 12GB వరకు LPDDR4X ర్యామ్, 512GB వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో వస్తుంది.
7/7
కెమెరాల విషయానికి వస్తే.. వివో V50లో జైస్ (Zeiss) వారి 50MP ప్రైమరీ రియర్ కెమెరా, 50MP సెకండరీ కెమెరా ఉంది. అంతేకాదు.. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా కూడా అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6,000mAh బ్యాటరీ ఉంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. ప్రీమియం బిల్డ్ క్వాలిటీ, మంచి కెమెరాలు, లాంగ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ తీసుకోవచ్చు.