Vivo V50 Price : పండగ చేస్కోండి.. ఈ వివో ఫోన్ మరి ఇంత తక్కువా.. ఫ్లిప్‌కార్ట్‌లో ధర ఎంతో తెలుసా?

Vivo V50 Price : వివో లవర్స్ తప్పక కొనాల్సిన ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొన్నారంటే ఏకంగా రూ. 7వేలకు పైగా తగ్గింపు పొందవచ్చు. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?

1/8
Vivo V50 Price : ఈ వివో ఫోన్ ఆఫర్ అదిరింది.. మిడ్ రేంజ్ ఫోన్లలో 2025లో వచ్చిన వివో V50 ఫోన్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ వివో ఫోన్ అసలు ధర రూ. 39,999 వద్ద లభ్యమవుతోంది. కానీ, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ వివో ఫోన్ రూ. 7వేలకుపైగా తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఇందులో 6.77-అంగుళాల డిస్‌ప్లేతో పాటు స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్ ఉంది.
2/8
కెమెరాల విషయానికి వస్తే.. ఈ వివో ఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ 50MP కెమెరా, ఫ్రంట్ సైడ్ 50MP కెమెరా ఉన్నాయి. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. ఫ్లిప్‌కార్ట్‌లో వివో V50 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/8
వివో V50 ఫ్లిప్‌కార్ట్ డీల్ : వివో V50 ఫోన్ రూ. 39,999 ధరకు లాంచ్ కాగా ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ. 32,999కే లభిస్తోంది. ఈ ఫోన్ సేల్ ధరపై రూ. 7వేలు ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో అదనంగా రూ. 1,650 సేవింగ్ చేసుకోవచ్చు.
4/8
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ నెలకు కేవలం రూ. 2,750 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌లను అందిస్తోంది. మీ పాత డివైజ్‌ను ట్రేడ్-ఇన్ చేస్తే.. ఫ్లిప్‌కార్ట్ రూ. 23,700 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూను అందిస్తోంది. అయితే, ఫైనల్ ఎక్స్ఛేంజ్ వాల్యూ, మీ పాత డివైజ్ బ్రాండ్, మోడల్ పర్ఫార్మెన్స్ బట్టి వాల్యూ ఉంటుంది.
5/8
వివో V50 స్పెసిఫికేషన్లు : ఈ హ్యాండ్‌సెట్‌లో 6.77-అంగుళాల అమోల్డ్ ప్యానెల్ ఉంది. 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. అంతేకాదు.. ఈ వివో ఫోన్ 4,500 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది.
6/8
ఈ వివో ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 512GB వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ 12GB LPDDR4X ర్యామ్ అందిస్తుంది. వివో V50 ఫోన్‌లో 6,000mAh బ్యాటరీ కూడా ఉంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
7/8
కెమెరా లవర్స్ కోసం వివో వి50 ఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో జైస్ (Zeiss) 50MP ప్రైమరీ రియర్ కెమెరా, 50MP సెకండరీ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ 50MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాతో వస్తుంది.
8/8
వివో V50 కొనాలా? వద్దా? : ప్రీమియం లుక్‌, అద్భుతమైన కెమెరాలతో లాంగ్ బ్యాటరీ బ్యాకప్‌ అందించే మిడ్-రేంజ్ ఫోన్ కోసం చూస్తుంటే వివో V50 ఫోన్ బెటర్. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో వివో V50 ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది.